- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
పట్టణ సమగ్ర అభివృద్ధికి ప్రణాళిక బద్ధంగా చర్యలు : మంత్రి శ్రీధర్ బాబు
దిశ,మంథని : మంథని పట్టణ సమగ్ర అభివృద్ధికి ప్రణాళిక బద్ధంగా చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు శాసనసభ వ్యవహారాల శాఖ మాత్యులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు.మంగళవారం మంత్రి శ్రీధర్ బాబు మంథని లో పలు అభివృద్ధి పనులకు జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష ,అదనపు కలెక్టర్ జే.అరుణ శ్రీ తో కలిసి మంథని పట్టణంలో పర్యటించారు. తెలంగాణ అర్బన్ ఫైనాన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా 24 కోట్ల 5 లక్షల వ్యయంతో చేపట్టిన పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు.ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. పట్టణంలో ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని ఉద్దేశంతో పలు అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతున్నామని అన్నారు.ప్రజా ప్రభుత్వం ఏర్పడిన వెంటనే 30 కోట్లతో రోడ్లు,డ్రైయిన్ నిర్మాణం చేపట్టామని తెలిపారు.
నేడు పురపాలక కార్యాలయం, డంపింగ్ యార్డ్ నందు సేగ్రిగేషన్ షెడ్,కంపోస్ట్ షెడ్,ఆఫీస్ రూమ్ సెక్యూరిటీ రూమ్,టాయిలెట్స్, వేయింగ్ బ్రిడ్జి పెద్దపల్లి, గోదావరిఖని,కాటారం నుండి మంథని పట్టణానికి వచ్చే రోడ్డు ప్రారంభంలో ఆర్చిలను రూ.9 కోట్ల 20 లక్షలతో చేపట్టామని అన్నారు.పట్టణంలోని ఆర్టీసీ బస్సు డిపో శ్రీరామ్ నగర్ నుంచి మాత శిశువు హాస్పిటల్ , పోచమ్మ వాడ నుంచి గోదావరిఖని క్రాస్ రోడ్,లైన్ గడ్డ, గంగాపురి క్రాస్ రోడ్,గిట్ల రమణారెడ్డి విగ్రహం,కూచి రాజు పల్లి క్రాస్ రోడ్ వద్ద రూ.6 కోట్ల 71 లక్షలతో సెంట్రల్ లైటింగ్ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశామని మంత్రి తెలిపారు.పట్టణంలో సమీకృత వెజ్,నాన్ వెజ్ సమీకృత మార్కెట్ నిర్మాణం, వివిధ వార్డులలో సిసి రోడ్లు,సైడ్ డ్రైయిన్ నిర్మాణ పనులను రూ.8 కోట్ల 14 లక్షలతో మంజూరు చేసి పనులు ప్రారంభించామని అన్నారు.
ఈరోజు మొత్తం పట్టణంలో రూ.24 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశామని మంత్రి తెలిపారు.6 నెలల కాలంలో మున్సిపల్ కార్యాలయం నిర్మాణం పూర్తి కావాలని మంత్రి అధికారులకు సూచించారు.గత 10 సంవత్సరాలలో మంథని ప్రాంతం ఆశించిన అభివృద్ధి జరగలేదని,ముఖ్యమంత్రి సహచర మంత్రుల సహకారంతో మంథని నుంచి మంచిర్యాలను కనెక్ట్ చేస్తూ 140 కోట్లతో గోదావరి నదిపై బ్రిడ్జి మంజూరు చేసుకున్నామని,అదే విధంగా మంథని పట్టణానికి రింగ్ రొడ్డు నిర్మాణం వల్ల పట్టణ విస్తరణ పెరుగుతుందని మంత్రి తెలిపారు.మంథని పట్టణ విస్తరణ జరుగడం వల్ల దేశ విదేశాలలో ఇతర ప్రాంతాలలో స్థిర పడిన ప్రజలు సొంత గ్రామాలలో ఇండ్లు నిర్మించుకునేందుకు,ఇక్కడ పరిశ్రమల స్థాపనకు అవకాశం ఉంటుందని,స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని,రోడ్ల అభివృద్ధి ద్వారా వాణిజ్య సదుపాయాలు మెరుగవుతాయని మంత్రి పేర్కొన్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా రైతుల సంతోషంగా ఉన్నారని, రుణమాఫీ,సన్న వడ్లకు క్వింటాళ్ల రూ.500 బోనస్ అందించడంతోపాటు ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు రైతు భరోసా క్రింద అందించే పెట్టుబడి సహాయాన్ని 12 వేలకు పెంచుతున్నామని అన్నారు.ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ ప్రజలకు ఇచ్చిన హామీలను ఒకటి తర్వాత ఒకటి అమలు చేస్తున్నామని అన్నారు.ప్రతి గ్రామ పంచాయతీలో రైతు రుణమాఫీ, సన్న వడ్లకు బోనస్,పెట్టుబడి సహాయం,రైతులు వివరాలు ప్రతి ఒక్కరికి తెలిసే విధంగా కేబుల్ ఛానల్ లో సామాజిక మీడియా ద్వారా ప్రచారం చేయాలని అన్నారు.అనంతరం మంత్రి ఆలింకో సంస్థ నిర్వహించిన క్యాంపులో ఎంపిక కాబడిన దివ్యాంగులకు ఉపకరణాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మంథని ఆర్డీవో సురేష్,మున్సిపల్ కమిషనర్ మనోహర్,తహసీల్దార్ రాజయ్య,ఈఈ సంపత్,ఏ.ఈ మౌనిక ,సంబంధిత అధికారులు,మున్సిపల్ చైర్మన్ పెండ్రి రమ దేవి,కమిషనర్ మనోహర్,ప్రజా ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.