మంచిర్యాల జిల్లాలో కానిస్టేబుల్‌కు కరోనా

by Aamani |
మంచిర్యాల జిల్లాలో కానిస్టేబుల్‌కు కరోనా
X

దిశ, ఆదిలాబాద్: మంచిర్యాల జిల్లాలో కరోనా కలకలం సృష్టిస్తోంది. విధుల్లో ఉన్న ఓ కానిస్టేబుల్‌కు కోవిడ్-19 సోకింది. రామకృష్ణాపూర్ పోలీస్ స్టేషన్‌లో సదరు కానిస్టేబుల్ విధులు నిర్వహిస్తున్నారు. అయితే ఎలాంటి కాంటాక్ట్ హిస్టరీ లేకుండా పాజిటివ్ రావడంతో ఆందోళన వ్యక్తమవుతోంది. వెంటనే కానిస్టేబుల్‌ను చికిత్స కోసం హైదరాబాద్ గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఆయన కుటుంబ సభ్యులను హోం క్వారంటైన్ చేశారు.

Advertisement

Next Story