కల్తీ కల్లుతో మరొకరు మృతి

by Shyam |
కల్తీ కల్లుతో మరొకరు మృతి
X

దిశ, వికారాబాద్: వికారాబాద్ జిల్లాలోని కల్తీకల్లు ఘటనలో మరొకరు మృతి చెందారు. పెండ్లిమడుగు గ్రామానికి చెందిన పెద్దింటి సంతోష (50) సోమవారం ఉదయం మృతి చెందింది. కల్లీకల్లు తాగి రెండు రోజులుగా అస్వస్థతతో వింత ప్రవర్తనకు గురై ఇవాళ ఉదయం పొలం దగ్గర మూర్చ వచ్చి బావిలో పడి ప్రాణాలు కోల్పోయింది.

ఇక నవాబ్‌పేట మండలం వట్టిమినేపల్లిలో కొమురయ్య అనే వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. హైదరాబాద్ ఉస్మానియా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. దీంతో కల్తీకల్లు మృతుల సంఖ్య 3కి చేరింది. ఇటీవలే కల్తీకల్లు తాగా పెండ్లిమడుగు వాసి కృష్ణారెడ్డి మృతి చెందాడు. వికారాబాద్, నవాబ్‌పేట్ మండలాల్లో కల్తీకల్లు తాగి 200 మందికి పైగా అస్వస్థతకు గురయ్యారు. బాధితులకు వికారాబాద్, పరిగి, ఉస్మానియా ఆస్పత్రుల్లో చికిత్సను అందిస్తున్నారు.

Advertisement

Next Story