కరోనా చికిత్సకు మరో కొత్త ఔషధం

by vinod kumar |   ( Updated:2021-04-23 05:27:06.0  )
కరోనా చికిత్సకు మరో కొత్త ఔషధం
X

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా కరోనా కేసులు పెరగడం, ఆక్సిజన్ కొరత తీవ్రంగా ఉన్న సందర్భంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఫార్మా దిగ్గజం జైదుస్ కాడిలా అభివృద్ధి చేసిన డ్రగ్ విరాఫిన్‌కు భారత రెగ్యులేటరీ డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా(డీసీజీఐ) అత్యవసర వినియోగానికి అనుమతినిచ్చింది. మాడరేట్ కేసుల్లో ఆక్సిజన్ సపోర్టు కాలాన్ని తగ్గిస్తుందని, పేషెంట్ల రికవరీ టైమ్‌నూ కుదించి మెరుగయ్యేందుకు దోహదపడుతుందని సంస్థ వెల్లడించింది. వీలైనంత త్వరగా ఈ విరాఫిన్ ఇంజెక్షన్ ఇస్తే అంతటి మెరుగైన ఫలితాలుంటాయని వివరించింది.

విరాఫిన్ సింగిల్ డోస్ ఇంజెక్షన్. వయోజనులపై చేసిన ప్రయోగంలో విరాఫిన్‌తో 91.15శాతం మంచి ఫలితాలు వచ్చాయని, అంతమొత్తంలో పేషెంట్లు రికవరీ అయ్యారని జైదుస్ వెల్లడించింది. వైరస్‌ను గుర్తించిగానే వీలైనంత త్వరగా విరాఫిన్ మందు ఇస్తే పేషెంట్ అంత త్వరగా రికవరీ అయ్యే అవకాశముందని, ఇతర సమస్యలనూ నిరోధించడానికి వీలుంటుందని తెలిపింది. మెడికల్ స్పెషలిస్ట్ ప్రిస్క్రిప్షన్ మీద ఈ మందు లభిస్తుందని, కానీ, దీన్ని హాస్పిటల్‌, లేదా ఇన్‌స్టిట్యూటషనల్ సెటప్‌లోనే వినియోగించాల్సి ఉంటుందని వివరించింది. ఈ మందు ఆక్సిజన్ అవసరాన్ని చాలా వరకు తగ్గిస్తుందని, శ్వాససంబంధ సమస్యలను నివారిస్తుందని అధికారులు చెప్పారు. దేశవ్యాప్తంగా ఆక్సిజన్ కొరత ఏర్పడ్డ తరుణంలో ఈ డ్రగ్‌కు ఆమోదం లభించడం శుభవార్తేనని నిపుణులూ అభిప్రాయపడుతున్నారు.

Advertisement

Next Story