కాంగ్రెస్ నుంచి మరో నేత సస్పెండ్​

by Shyam |   ( Updated:2021-08-23 08:54:45.0  )
Gandhi Bhavan
X

దిశ, తెలంగాణ బ్యూరో : కాంగ్రెస్​ పార్టీ నుంచి మరో నేతను సస్పెండ్​ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇటీవల జరిగిన రావిర్యాల సభలో పాసుల విషయంలో టీపీసీసీ చీఫ్ ​రేవంత్​రెడ్డి, ఏఐసీసీ ఇంచార్జ్ ​ఠాగూర్​పై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు ఆ పార్టీ నేత, టీపీసీసీ మాజీ కార్యదర్శి ఘంటా సత్యనారాయణరెడ్డిని సస్పెండ్​ చేస్తున్నట్లు టీపీసీసీ క్రమశిక్షణా సంఘం చైర్మన్​ కోదండరెడ్డి వెల్లడించారు. ఈ అనుచిత వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్​ నేత నిరంజన్, సత్యనారాయణరెడ్డికి రెండు రోజుల కిందట నోటీసులిచ్చారు. సోమవారం జరిగిన క్రమశిక్షణా సంఘం సమావేశానికి నిరంజన్ హాజరై లిఖితపూర్వకంగా సమాధానమిచ్చారు. సత్యనారాయణరెడ్డి హాజరు కాలేదు. కానీ ఆయన రాతపూర్వకంగా సమాధానం ఇచ్చినా సంతృప్తి చెందలేదు. దీంతో ఆయనపై సస్పెండ్​ వేటు వేశారు. నిరంజన్‌కు మరో నోటీసు జారీ చేశారు.

Advertisement

Next Story

Most Viewed