- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కరోనా కాటుకు మరో జర్నలిస్టు మృతి..
దిశ, సిర్పూర్ టౌన్ : తెలంగాణలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. కరోనా ఇప్పటికే పలువురు పాత్రికేయులను బలి తీసుకుంది. తాజాగా కరోనా కాటుకు మరో రిపోర్టర్ బలయ్యాడు. కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా పెంచికల్‌పేట్ మండలానికి చెందిన ఓ దినపత్రిక స్టాఫ్ రిపోర్టర్ జునగిరి రమేష్ (38) కరోనాతో పోరాడి తుది శ్వాస విడిచారు.
వివరాల ప్రకారం.. వారం రోజుల క్రితం రమేష్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో కాగజ్ నగర్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో పరిస్థితి విషమించడంతో నాలుగు రోజుల క్రితం మెరుగైన చికిత్స కోసం మంచిర్యాలలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో ఈరోజు ఉదయం రమేష్ మృతి చెందారు. అతనికి భార్య, కుమార్తె, కుమారుడు ఉన్నారు. రమేష్ మృతి పట్ల పెంచికల్‌పేట్ ప్రెస్ క్లబ్ నాయకులు వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.