బిగ్‌బాస్ సోహెల్‌కు మరో భారీ ఆఫర్

by Shyam |
బిగ్‌బాస్ సోహెల్‌కు మరో భారీ ఆఫర్
X

దిశ, వెబ్‌డెస్క్: గత పదిహేను వారాలుగా తెలుగు ప్రేక్షకులను ఎంతగానో అలరించిన రియాలిటీ షో బిగ్ బాస్ ఆదివారంతో ముగిసింది. ఈ సీజన్‌లో అభిజిత్‌ విన్నర్‌గా నిలిచాడు. కానీ టాప్ త్రీలో నిలిచిన కంటెస్టెంట్ సోహెల్ అంతకుమించి విజయాన్ని సాధించాడు. అభిజిత్ ఎక్కువ మనీ సంపాదించడమే కాకుండా, భారీ ఆఫర్లు కూడా కొట్టేశాడు. సాక్షాత్తు మెగాస్టార్ చిరంజీవి నీ సినిమాలో నాకు చిన్న పాత్ర ఇవ్వు సోహెల్ అంటూ మెగా ఆఫర్ ప్రకటించాడు. అంతేగాకుండా స్వయంగా మెగాస్టార్ ఇంటి నుంచి సోహెల్ కోసం మటన్ బిర్యానీ వండుకుని తీసుకొచ్చాడు. దీంతో సోహెల్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. దీంతో షోలో అభిజిత్ గెలిచాడా? సోహెల్ గెలిచాడా అన్న సందిగ్ధంలో అభిమానులు పడేపోయేలా ఫైనల్ షోలో సోహెల్ హైలెట్ అయ్యాడు. ఇదిలా ఉండగా సోహెల్‌కు మరో లెజెండరీ యాక్టర్ నుంచి క్రేజీ ఆఫర్ వచ్చినట్టు సమాచారం. ఏకంగా కింగ్ కమెడియన్ బ్రహ్మానందం సోహెల్‌కు ఫోన్ చేసి నీ సినిమాలో నేను ఫ్రీగా నటిస్తానని బంపర్ ఆఫర్ ప్రకటించినట్టు సమాచారం. దీంతో మనోడి ఆనందం అంతా ఇంతా కాదు. మరి ఈ ఆఫర్లను సరిగ్గా వాడుకుంటాడా లేదా చూడాలి.

Advertisement

Next Story

Most Viewed