విశాఖలో మరో అగ్ని ప్రమాదం

by Anukaran |
విశాఖలో మరో అగ్ని ప్రమాదం
X

దిశ, వెబ్‌డెస్క్: విశాఖ జిల్లాలో అగ్ని ప్రమాదం జనాలను పరిగెత్తించింది. ఒక్కసారిగా దట్టమైన పొగలు రావడంతో స్థానికులు ఒక్కసారిగా భయభ్రాంతులకు గురయ్యారు. సోమవారం అక్కిరెడ్డిపాలెం షీలానగర్ సమీపంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది.

షీలానగర్ సమీపంలో ఉన్న గేట్‌వే కంటైనర్‌ యార్డులో ఈ అగ్ని ప్రమాదం జరిగింది. కంటైనర్‌లను ట్రాన్స్‌పోర్ట్ చేస్తున్న తరుణంలో క్రేన్ రాడ్‌కు ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అదే కంటైనర్‌లో రసాయన పదార్థాలు ఉండడంతో పొగ దట్టంగా వ్యాపించినట్లు గేట్ వే సిబ్బంది వివరణ ఇచ్చారు. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చాయి.

Advertisement

Next Story