- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
ఏపీలో మరో డెల్టా ప్లస్ కేసు కలకలం

X
దిశ, వెబ్‌డెస్క్: ఏపీలో డెల్టా ప్లస్ కేసులు బయట పడుతున్నాయి. ఇటీవల తిరుపతిలో ఒక డెల్టా ప్లస్ కేసు కలకలం రేపగా.. తాజాగా ఏపీలో మరో డెల్టా ప్లస్ కేసు నమోదైంది. విశాఖలో తొలి డెల్టా ప్లస్ కేసు వెలుగు చూసింది. జీవీఎంసీ జోన్1 విశాఖపట్నం జిల్లా మధురవాడ వాంబేకాలనీలో డెల్టా ప్లస్ మొదటి కేసు నమోదైంది. మధురవాడ పి.హెచ్.సి. పరిధిలోని డోర్ నెంబర్ 20A/gf-3 నివాసి పాడి.మేరీ (51)కు పీహెచ్‌సీ సిబ్బంది టెస్ట్ చేయగా పాజిటివ్ వచ్చింది. సిబ్బంది శాంపిల్స్‌ను హైదరాబాద్‌లోని ఒక ల్యాబ్‌కు పంపించారు. ల్యాబ్ సిబ్బంది డెల్టా ప్లస్ కేసుగా నిర్ధారించారు. వైద్య సిబ్బంది వాలంటీర్ల సహాయంతో చుట్టు పక్కల ప్రాంతాలను శానిటైజ్ చేస్తున్నారు. బారికేడ్లతో పరిసర ప్రాంతాలను మూసివేశారు.
- Tags
- case
- delta plus
Next Story