- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘ఆర్ఆర్ఆర్’కు కొత్త రచయిత
అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం ‘రౌద్రం రుధిరం రణం(ఆర్ఆర్ఆర్). దర్శక ధీరుడు రాజమౌళి డైరెక్షన్‌లో తారక్, రామ్ చరణ్‌లు కొమురం భీమ్, అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్న చిత్రం కరోనా కారణంగా వాయిదా పడింది. అయినా సరే, సాధ్యమైనంత వరకు వర్క్ ఫ్రమ్ హోమ్ చేసింది మూవీ యూనిట్. కానీ జక్కన్న ఫ్యామిలీకి కరోనా పాజిటివ్ నిర్ధారణ కావడంతో ఆరోగ్యంపై శ్రద్ధ వహించారు. రెండు రోజుల క్రితం కరోనా నెగటివ్ రాగా.. మళ్లీ వర్క్ మీద కాన్సంట్రేట్ చేశారని టాక్.
కాగా ఇప్పటికే జక్కన్న సతీమణి రమా రాజమౌళి కాస్ట్యూమ్ డిజైనర్‌గా వర్క్ చేయగా.. ‘ఆర్‌ఆర్‌ఆర్’తో సరికొత్త బాధ్యతలు తీసుకోనున్నట్టు సమాచారం. చిత్రంలో కీలక ఎపిసోడ్‌కు డైలాగ్ రచయితగా పని చేయనున్నారని తెలుస్తోంది. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న చిత్రాన్ని డీవీవీ దానయ్య నిర్మిస్తుండగా.. సాయి మాధవ్ బుర్రా డైలాగ్ రైటర్‌గా పనిచేస్తున్నారు. అయితే కరోనా కారణంగా వాయిదాపడ్డ సినిమా షూటింగ్ 2021లోనే మొదలు కానుందని సమాచారం.