- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సిద్దిపేటకు మరో కార్పొరేషన్ పదవి.. పరిశీలనలో జేఏసీ నేత పేరు?
దిశ ప్రతినిధి, మెదక్ : రాష్ట్రంలో ప్రస్తుతం నామినేటెడ్ పదవుల భర్తీ ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటికే ఖాళీగా ఉన్న పలు కార్పొరేషన్ చైర్మన్ స్థానాలను భర్తీ చేయగా, మరికొన్ని భర్తీ చేసే యోచనలో సీఎం కేసీఆర్ ఉన్నట్టు తెలుస్తోంది. వివిధ కార్పొరేషన్ చైర్మన్ స్థానాలు ఖాళీగా ఉన్నప్పటికీ అందరి దృష్టి ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ ఎవర్ని వరిస్తుందనే చర్చ జోరుగా సాగుతోంది. గతంలో ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ పదవిని సిద్దిపేట జిల్లా వాసికి కేటాయించడంతో మరోమారు కూడా ఆ జిల్లాకే కేటాయిస్తారని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇందులో సిద్దిపేట జిల్లాకు చెందిన బత్తుల చంద్రం పేరు ప్రధానంగా వినిపిస్తోంది.
సిద్దిపేట జిల్లాకు ఆరు కార్పొరేషన్ చైర్మన్లు
సీఎం కేసీఆర్ సొంత జిల్లా కావడంతో చాలా మంది నామినేటెడ్ పదవుల కోసం ఆరాటపడుతున్నారు. తెలంగాణ ఉద్యమ సమయం నుండి కేసీఆర్ వెన్నంటే ఉన్న వారు చాలా మందే ఉన్నారు. అందులో ప్రధానంగా ఆరుగురికి చైర్మన్ పదవులు దక్కాయి. ప్రస్తుతం టీఎస్ఐఐసీ చైర్మన్‌గా గ్యాదరి బాలమల్లు, సివిల్ సప్లయ్ కార్పొరేషన్ చైర్మన్‌గా మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి, టూరిజం కార్పొరేషన్ చైర్మన్‌గా ఉప్పల శ్రీనివాస్ గుప్తా, డీసీసీబీ చైర్మన్ చిట్టి దేవేందర్ రెడ్డి, సాంస్కృతిక శాఖ చైర్మన్‌గా మానకొండూరు ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ కొనసాగుతున్నారు. గతంలో ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్‌గా కొనసాగిన ఎర్రోళ్ల శ్రీనివాస్‌కు ప్రస్తుతం తెలంగాణ వైద్య సేవలు, మౌళిక సదుపాయాల కార్పొరేషన్ చైర్మన్ బాధ్యతలు అప్పగించారు. ఈయనతో కలిపి సిద్దిపేట జిల్లాకు ఆరు చైర్మన్ పదవులు దక్కాయి. ఇంకా పలు కార్పొరేషన్ చైర్మన్ స్థానాలు ఖాళీ ఉండటంతో మరికొందరు ఉద్యమకారులు చైర్మన్ స్థానం కోసం పోటీ పడుతున్నారు.
ఎస్సీ, ఎస్టీ చైర్మన్ రేసులో బత్తుల చంద్రం..!
ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ రేసులో పలువురు దళిత సంఘాల నాయకులు పోటీ పడుతున్నారు. ఇప్పటికే పలువురు సీఎం కేసీఆర్, మంత్రులు హరీశ్ రావు, కేటీఆర్‌ను కలిసి తమకు పదవి కట్టబెట్టాలని ఫైరవీలు చేస్తున్నట్టు టీఆర్ఎస్ నాయకుల నుండి అందుతున్న సమాచారం. ఎస్సీ, ఎస్టీ కమిషన్ తొలి చైర్మన్‌గా సిద్దిపేట జిల్లాకు చెందిన ఎర్రోళ్ల శ్రీనివాస్ బాధ్యతలు స్వీకరించారు. ఎస్సీ, ఎస్టీ కమిషన్ హోదాలో ఆయన చేసిన సేవలు ఆ పదవికే వన్నె తెచ్చాయి. దీంతోచాలా మంది ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ కోసం ఆరాటపడుతున్నారు. ఇందులో ప్రధానంగా సిద్దిపేట జిల్లాకు చెందిన బత్తుల చంద్రం పేరు వినిపిస్తోంది. ప్రస్తుతం ఆయన దళిత సంఘాల ఐకాస రాష్ట్ర అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో రాష్ట్ర సాధన కోసం అనేక ఉద్యమాల్లో పాల్గొన్నాడు. ప్రస్తుతం జిల్లా మంత్రి హరీశ్ రావుతో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు.
చంద్రంకే కేటాయించాలంటూ డిమాండ్లు
దళిత సంఘాల జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడిగా కొనసాగుతున్న బత్తుల చంద్రంను రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్‌గా నియమించాలని పలువురు కోరుతున్నారు. తాజాగా బత్తుల చంద్రంకు ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ పదవి ఇవ్వాలని దళిత సంఘాల జేఏసీ నల్గొండ జిల్లా అధ్యక్షుడు చింత ఎల్లన్న ప్రభుత్వాన్ని కోరారు. దీనికి సంబంధించిన వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ పార్టీ బలోపేతం, మంత్రి హరీశ్ రావు వద్ద మంచి పేరు సంపాదించిన నేతగా పేరొందిన బత్తుల చంద్రంకు కమిషన్ పదవి దక్కుతుందో లేదో తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.
సీఎం ఆశీస్సులు ఉంటే చాలు
సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్ రావు ఆశీస్సులు ఉంటే చాలు. వారు తనపై నమ్మకం ఉంచి ఏ పదవి అప్పగించినా ఆ పదవిని సక్రమంగా నిర్వర్తిస్తూ ఆ పదవికే వన్నె తెస్తాను. ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ గా తనను పలువురు అభ్యర్థించడం సంతోషంగా ఉంది.
-బత్తుల చంద్రం, దళిత సంఘాల జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు