- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఇంగ్లండ్ నుంచి కరోనాని మోసుకొచ్చాడు
ఆంధ్రప్రదేశ్‌లో మరో కరోనా కేసు నమోదైంది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌లో ఆరు కరోనా కేసులు నమోదయ్యాయి. తాజాగా 25 ఏళ్ల విశాఖ యువకుడికి కరోనా పాజిటివ్ వచ్చినట్టు నిర్ధారణ అయింది. దీంతో ఏపీలో ఏడు కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ యువకుడు ఇంగ్లాండ్ నుంచి విశాఖ వచ్చినట్టు తెలుస్తోంది.
ఏపీలో కర్నూలు బాధితుడు కరోనా నుంచి కోరుకోగా, ప్రకాశం, కృష్ణా, విశాఖ జిల్లాల్లో బాధితులు ఇంకా చికిత్స పొందుతున్నారు. తెలంగాణలో కరోనా కేసులు 30 వరకు నమోదయ్యాయి. తాజాగా హిమాచల్ ప్రదేశ్ లో 69 ఏళ్ల వృద్ధుడు కరోనా మహమ్మారికి బలయ్యాడు. ఆ వృద్ధుడు మార్చి 15న అమెరికా నుంచి భారత్ వచ్చినట్టు గుర్తించారు. భారత్ లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 439కి చేరింది. కరోనా బాధతో 10 మంది మృత్యువాతపడ్డారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 37 మంది కరోనాతో కోలుకున్నారు.
అత్యధికంగా అమెరికాలో ఇప్పటి వరకు 45,268 కరోనా కేసులు నమోదయ్యాయి. 582 మంది కరోనా ప్రభావంతో మృత్యువాత పడ్డారు. కోరానా బారినపడిన 295 మంది కోలుకున్నారు. చైనాలో అయితే ఈ రోజు 78 కేసులు నమోదు కాగా, ఏడుగురు మృత్యువాత పడ్డారు. దీంతో చైనాలో 3,277 మంది కరోనా కారణంగా మృత్య వాతపడ్డారు. 73,159 మంది కరోనా కారణంగా అస్వస్థులయ్యారు.
Tags: coronavirus, covid-19, india world, visakhapatnam, andhra pradesh