- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
బెడిసికొట్టిన బల్దియా మరో ప్రయత్నం.. వారి జోక్యంతోనే ఆపరేషన్ ఫెయిల్
దిశ, సిటీబ్యూరో: మహానగరంలో అక్రమ నిర్మాణాలను ప్రాథమిక స్థాయిలో అడ్డుకునేందుకు బల్దియా చేసిన మరో ప్రయత్నం విఫలమైంది. అక్రమ నిర్మాణం చేపట్టే యజమానులు, సర్కిళ్లలో రెగ్యులర్ గా విధులు నిర్వర్తించే వారితో ఏ మాత్రం పరిచయం లేని వ్యక్తులతో నిర్వహించిన ఫేస్ లెస్ ఆపరేషన్ వికటించింది. మూడు నెలల క్రితం జీహెచ్ఎంసీ అధికారులు ఎంతో పకడ్బందీగా డిజైన్ చేసిన ఈ జోనల్ టాస్స్ ఫోర్స్ లో విధులు నిర్వర్తించేందుకు న్యాక్ నుంచి వంద మంది ఇంజనీర్లను నియమించారు. జీహెచ్ఎంసీ సిబ్బంది, అధికారుల ఎలాంటి సంబంధం లేకుండా క్షేత్ర స్థాయిలో పర్యటించి అక్రమ నిర్మాణాలను గుర్తించి, వాటి తాలూకు నివేదికలను ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులకు సమర్పించిన తర్వాత వారు వాటిని నేలమట్టం చేయాలన్నది జోనల్ టాస్ ఫోర్స్ ప్రధాన ఉద్దేశ్యం.
ఇందులో కీలకమైన విధులు నిర్వర్తించే న్యాక్ ఇంజనీర్లు కూడా తొలుత తమకు కేటాయించిన సర్కిళ్లలో ఎక్కువ రోజులు కొనసాగకుండా వారిని ప్రతి ఇరవై నుంచి ముప్పై రోజులకోసారి ఒకే జోన్ లోని వేరే సర్కిళ్లకు బదిలీ చేస్తూ వచ్చారు. ఈ రకంగా ఒక్కో ఇంజనీర్ ను నెలకు రెండు సర్కిళ్ల బదిలీ చేయటం వల్లే జీహెచ్ఎంసీలో వారు విధులు నిర్వర్తించేందుకు ససేమిరా అంటున్నట్లు చర్చ లేకపోలేదు. ఇలా తరుచూ బదిలీలు కావటంతో బేజారైన న్యాక్స్ ఇంజనీర్లు వరుసగా సెలవులు పెట్టుకుని వెళ్లసాగారు. కొన్ని సందర్భాల్లో పలు అక్రమ నిర్మాణాలను కూల్చివేసే విషయంలో లా అండ్ ఆర్డర్ సమస్యలు తలెత్తరాదన్న ఉద్దేశ్యంతో పోలీసు బందోబస్తును కోరే అవసరం ఏర్పడింది. అయితే ఆ అధికారం చట్టపరంగా న్యాక్స్ ఇంజనీర్లకు లేకపోవటంతో అధికారులు సర్కిళ్లలోని డిప్యూటీ కమిషనర్లకు ఆ బాధ్యతలను నోడల్ అధికారులుగా నియమించినట్లు తెలిసింది. అదే అదునుగా డిప్యూటీ కమిషనర్లు పలువురు అక్రమ నిర్మాణాలపై దందాలు ప్రారంభించారు. ఈ క్రమంలో న్యాక్స్ ఇంజనీర్లపై పని భారం పెరగటంతో వారు ఒక్కోక్కరు వరుసగా సెలవులపై వెళ్లటం ప్రారంభించారు.
ప్రస్తుతం సెలవులపై ఉన్న వారు పదుల సంఖ్యలో ఉన్నట్లు సమాచారం. ఈ విషయాన్ని అసిస్టెంట్ సిటీ ప్లానర్లు(ఏసీపీ)లు చీఫ్ సిటీ ప్లానర్ దేవేందర్ రెడ్డి దృష్టికి కూడా తీసుకెళ్లినట్లు సమాచారం. న్యాక్ ఇంజనీర్లంతా సెలవులను రద్దు చేసుకుని విధుల్లో చేరాలని సీసీపీ ఆదేశాలు జారీ చేసినా, డిప్యూటీ కమిషనర్ల వేధింపులకు భయపడి ఎవరూ కూడా విధుల్లో చేరేందుకు ఇష్టపడటం లేదని తెలిసింది.
బలోపేతంపై ప్రత్యామ్నాయం..
అమల్లోకి వచ్చిన కొత్తలో ఎన్నో అక్రమ నిర్మాణాలను ఎంతో చాకచక్యంగా, వ్యూహాత్మకంగా నేలమట్టం చేసిన జోనల్ ఎన్ ఫోర్స్ మెంట్ ను మళ్లీ ఎలా బలోపేతం చేయాలన్న అంశంపై అధికారులు కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. హెచ్ఎంసీలోని టౌన్ ప్లానింగ్ తో పాటు ఇతర విభాగాలతో ఎలాంటి సంబంధం లేకుండా ఈ ఎన్ ఫోర్స్ మెంట్ విధులు నిర్వర్తించేలా ఎలాంటి వ్యూహాలు రచించాలన్న విషయంపై అధికారులు కసరత్తు దృష్టి సారించినట్లు తెలిసింది.