- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
చెప్పుకోలేని మూడు ప్రేమకథలు.. ఆకట్టుకుంటున్న ‘అన్‌కహీ కహానియా’ ట్రైలర్
దిశ, సినిమా : ‘మీరు ప్రేమలో లేనప్పుడు, ప్రేమ కోసం చూస్తున్నప్పుడు లేదా మీ హృదయం విచ్ఛిన్నం అయినప్పుడు’ నగరాలు నివసించడానికి చాలా కష్టమైన ప్రదేశంగా ఉంటాయనే స్టోరీ లైన్‌తో తెరకెక్కిన నెట్‌ఫ్లిక్స్ ఆంథాలజీ ‘అన్‌కహీ కహానియా’ ట్రైలర్ ఆకట్టుకుంటోంది. ప్రేమ, వాంఛ, ద్రోహం చుట్టూ తిరిగే మూడు యూనిక్ లవ్ స్టోరీస్‌తో.. ముగ్గురు క్రిటికల్లీ అక్లైమ్‌డ్ డైరెక్టర్స్ అశ్వినీ అయ్యర్ తివారీ, అభిషేక్ చౌబే, సాకేత్ చౌదరి దర్శకత్వంలో ఆంథాలజీ రూపుదిద్దుకుంది.
మ్యారేజ్ లేదా లైఫ్ వీటిలో ఏది చూజ్ చేసుకోవాలో తెలియని దంపతులది ఒక స్టోరీ కాగా.. వారిద్దరి మధ్య ఉన్నది ప్రేమ లేదా అట్రాక్షన్? తెలియని డైలామోలో ఉన్న యంగ్ కపుల్స్‌ది మరో కథ. ఇక గ్రామంలో ఉన్న కుటుంబానికి దూరంగా ముంబైలో జాబ్ చేస్తున్న ఓ వ్యక్తి.. తను పనిచేసే షాపులోని బొమ్మనే తన ఏంజెల్‌గా భావించి తనతో అన్ని విషయాలు షేర్ చేసుకోవడం.. ఈ విషయం తెలిసి అతన్ని పనిలో నుంచి తీసేయడం అనేది మరోస్టోరీ. ఫైనల్‌గా బంధం ముఖ్యమా? లేక ఐడెంటిటీ ఇంపార్టెంటా? అనే కాన్సెప్ట్‌తో మూడు స్టోరీస్ తెరకెక్కినట్లు తెలుస్తుండగా.. త్వరలో రిలీజ్ డేట్ అనౌన్స్ చేయనున్నారు మేకర్స్.