ఏటి అగ్రహారం పేరు మారుస్తారా: సోము వీర్రాజు వార్నింగ్

by Mahesh |   ( Updated:2023-05-04 14:45:42.0  )
ఏటి అగ్రహారం పేరు మారుస్తారా: సోము వీర్రాజు వార్నింగ్
X

దిశ, డైనమిక్ బ్యూరో : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి హిందువుల మనోభావాలను దెబ్బతీసే కార్యక్రమాలను అమలు చేస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ఆరోపించారు. ఎన్నికల్లో గెలుపొందేందుకు ఓట్ల కోసం కుల, మత రాజకీయాలు చేస్తుందని ఆరోపించారు. విశాఖ నగరంలో సీతమ్మ కొండ పేరు మార్చి వైఎస్ఆర్ వ్యూ అని పేరు మార్పుపై ఇప్పటికే బీజేపీ పోరాటం చేస్తుందని ఆ ఘటన మరువకముందే గుంటూరులో ఏటి అగ్రహారం పేరు రాత్రికి రాత్రి తొలగించడంపై మండిపడ్డారు. ఏటీ అగ్రహారం పేరు తొలగించింది ఫాతిమా నగర్ పేరుతో బోర్డులు పెట్టడం ఏంటని నిలదీశారు. ఏటీ అగ్రహారం పేరు వల్ల వైఎస్ జగన్‌కు కలిగిన ఇబ్బంది ఏంటి.. ఫాతిమా నగర్ అని మార్చడం వల్ల వచ్చే లాభం ఏంటని ప్రశ్నించారు.

ఈ పేరు మార్పు వెనుక ప్రభుత్వం ఉద్దేశం ఏమిటి అని నిలదీశారు. గుంటూరు కార్పొరేషన్ తీర్మానం చేసిందని పేర్లు మార్చేస్తారా అని మండిపడ్డారు. ప్రొద్దుటూరు కార్పొరేషన్ తీర్మానం చేసిందంటూ టిప్పు సుల్తాన్ విగ్రహం పెట్టాలని ప్రయత్నం చేస్తారా అని నిలదీశారు. ఈ తరహా సంఘటనలకు ఎవరు సూత్రధారి అని నిలదీశారు. ఈ మేరకు వీడియో విడుదల చేశారు. ముస్లింల కోసం చట్టాలు మారుస్తామని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ప్రకటించడం దారుణమన్నారు. సజ్జల రామకృష్ణారెడ్డికి ఈ రాష్ట్రంలోని హిందువులు కనిపించడం లేదా అని నిలదీశారు. లాగే హిందూ ఎస్సీలకు వ్యతిరేకంగా ప్రభుత్వ పోకడలు చూస్తే హిందువుల పై దాడులకు తెగబడే విధంగా వైసీపీ వ్యవహరిస్తోంది అని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫాతిమా నగర్ పేరును తొలగించి ఏటీ అగ్రహారం పేరునే కొనసాగించాలని లేని పక్షంలో బీజేపీ పోరాటం చేస్తుందని సోము వీర్రాజు హెచ్చరించారు.

Advertisement

Next Story

Most Viewed