‘డిప్యూటీ సీఎం, మంత్రులుగా ఉండి తేలేకపోయారు’

by Shyam |
‘డిప్యూటీ సీఎం, మంత్రులుగా ఉండి తేలేకపోయారు’
X

దిశ, ఆందోల్: జోగిపేటను రెవెన్యూ డివిజన్‌గా ఏర్పాటు చేయడం వల్ల వ్యాపారాలు అభివృద్ధి చెంది, ప్రజల జీవన ప్రమాణాలు మెరుగవుతాయని ఆందోల్ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ అన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చడానికి కృషి చేస్తానని ప్రకటించారు. గతంలో డిప్యూటీ సీఎం, మంత్రులుగా పని చేసినవారు సైతం రెవెన్యూ డివిజన్‌ను తేలేకపోయారు ఎమ్మెల్యే ఎద్దేవా చేశారు. ఆర్థిక మంత్రి హరీశ్ రావు చేతుల మీదుగా త్వరలో జోగిపేట రెవెన్యూ డివిజన్, చౌటకూర్ తహసీల్దార్ ఆఫీసులను ప్రారంభిస్తున్నట్లు వెల్లడించారు. ఈ సమావేశంలో మార్కెట్ కమిటీ చైర్మన్ మల్లికార్జున్, మునిసిపల్ చైర్మన్ మల్లయ్య, జిల్లా రైతు సమన్వయ కమిటీ సభ్యుడు లింగా గౌడ్ పాల్గొన్నారు.

Advertisement

Next Story