- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘వైసీపీని అధఃపాతాళానికి తొక్కమనండి చూద్దాం’
దిశ, వెబ్‌డెస్క్: తాడేపల్లిగూడెంలో జనసేన-టీడీపీ ఉమ్మడిగా ‘జెండా’ సభ నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ సభలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం జగన్ మోహన్ రెడ్డిని టార్గెట్ చేసి స్ట్రాంగ్ కామెంట్స్ చేశారు. తాజాగా.. పవన్ కల్యాణ్ కామెంట్స్‌కు వైసీపీ నేత వైవీ సుబ్బారెడ్డి స్పందించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... వైసీపీని అధ:పాతాళానికి తొక్కమనండి చూద్దాం అంటూ సవాల్ చేశారు. రాజకీయం అంటే పవన్ కల్యాణ్ సినిమాల్లో డైలాగ్ చెప్పినంత ఈడీ అనుకుంటున్నాడు.. వాస్తవ పరిస్థితులు తెలుసుకోవడానికి సమయం పడుతుందని విమర్శించారు.
వచ్చే ఎన్నికల్లో ఏపీలో జరిగేది క్లాస్ వార్.. క్యాస్ట్ వార్ కాదని అన్నారు. తమది చీటింగ్ కాదు.. జనసేన, టీడీపీది లూటీ టీమ్ అని ఎద్దేవా చేశారు. వైసీపీకి అభ్యర్థులు లేక కాదు.. 175 సీట్లు కచ్చితంగా గెలవాలనే లక్ష్యంలో భాగంగా మార్పులు చేశామని అన్నారు. కాపుల అభివృద్ధిపై సీఎం జగన్ ప్రత్యేక శ్రద్ధ పెట్టారని అన్నారు. అందులో భాగంగానే కాపులకు రూ.25 కోట్ల విలువజేసే భూమిని విశాఖ నడిబొడ్డున ఇచ్చారని చెప్పారు. అన్ని వర్గాలకు లాభం చేకూర్చేలా జగన్ నిర్ణయాలు ఉంటాయని అన్నారు.