Vijayasai Reddy: ఊహించని విధంగా మళ్లీ అధికారంలోకి వస్తాం.. విజయసాయి రెడ్డి సంచలన వ్యాఖ్యలు

by Shiva |   ( Updated:2024-11-03 09:35:45.0  )
Vijayasai Reddy: ఊహించని విధంగా మళ్లీ అధికారంలోకి వస్తాం.. విజయసాయి రెడ్డి సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఊహించని విధంగా వైసీపీ ప్రభుత్వం (YCP Government) తిరిగి అధికారంలో వస్తుందని ఎంపీ విజయసాయి రెడ్డి (Vijayasai Reddy) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇవాళ చిత్తూరు, తిరుపతి జిల్లాల అధ్యక్షుడిగా భూమన కరుణాకర్‌ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన విజయసారెడ్డి మాట్లాడుతూ.. కేంద్రం జమిలీ ఎన్నికలకు కసరత్తు చేస్తుందని, 2027 చివరి నాటికి రాష్ట్రంలో మద్యంతర ఎన్నికలు రావడం ఖాయమని అన్నారు. ఇప్పటి నుంచే ఎన్నికల కోసం బూత్ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు కేడర్ సమాయత్తం చేస్తున్నామని పేర్కొన్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అప్పుడే అరాచకాలకు తెర లేపిందని ఆరోపించారు. రాష్ట్రంలో సంక్షేమం, అభివృద్ధి అటకెక్కాయని ఆయన ఎద్దేవా చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ (YCP) నాయకులపై అకారణంగా కేసులు పెడుతున్నారని ఆరోపించారు. తిరుమల (Tirumala) శ్రీవారి లడ్డూపై సీఎం చంద్రబాబు (CM Chandrababu) కావాలనే తప్పుడు ప్రచారం చేశారని విజయసాయిరెడ్డి ఫైర్ అయ్యారు.

Advertisement

Next Story