YV Subba Reddy: ముందు ఆ పని చేయండి.. లేదంటే కోర్టుకు వెళతాం: వైవీ సుబ్బారెడ్డి హాట్ కామెంట్స్

by Shiva |
YV Subba Reddy: ముందు ఆ పని చేయండి.. లేదంటే కోర్టుకు వెళతాం: వైవీ సుబ్బారెడ్డి హాట్ కామెంట్స్
X

దిశ, వెబ్‌డెస్క్: తిరుపతి (Tirupati)లో వైకుంఠ ద్వార దర్శనం (Vaikunta Dwara Darshan) టికెట్ల జారీ కేంద్రం వద్ద జరిగిన తొక్కిసలాట రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో టీటీడీ మాజీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి (YV Subba Reddy) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తిరుపతి (Tirupati)లో తొక్కిసలాట (Stampede) జరగడం దురదృష్టకరమని అన్నారు. ఆ ఘటనకు బాధ్యులైన అధికారులపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఒకవేళ ప్రభుత్వం స్పందించకపోతే కేసులు పెట్టి కోర్టులలో పోరాటం చేస్తామని హెచ్చరించారు.

తొక్కిసలాట జరిగిన వెంటనే తూతూమంత్రంగా అధికారులను బదిలీ చేశారని ఆరోపించారు. చంద్రబాబు (Chandrababu), పవన్ కళ్యాణ్ (Pavan Kalyan) అధికారంలోకి వచ్చిన తరువాత రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ (YCP) ముఖ్య నాయకులు, కార్యకర్తలపై విచ్చలవిడిగా కేసులు నమోదు చేస్తున్నారని ఫైర్ అయ్యారు. అధికారంలోకి వచ్చి 7 నెలలు గడుస్తున్నా.. ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను ఇంత వరకు నెరవేర్చలేదని ధ్వజమెత్తారు. కూటమి సర్కార్ హయాంలో రాష్ట్రంలో సంక్రాంతి (Sankranti) శోభ లేదని వైవీ సుబ్బారెడ్డి సెటైర్లు వేశారు.

Advertisement

Next Story

Most Viewed