- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Ap News: 434 కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సు పోస్టుల భర్తీకి చర్యలు
దిశ, కడప: రాష్ట్ర ప్రభుత్వం 434 కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సు పోస్టుల భర్తీకి చర్యలు చేపట్టింది. ఈ మేరకు డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డాక్టర్ వి. రామిరెడ్డి నోటిఫికేషన్ విడుదల చేశారు. ఇక పోస్టులకు సంబంధించి తొలుత సంవత్సర కాలం కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఎంపిక చేయనున్నారు. జోన్ 1లో 86 పోస్టులు, జోన్ -2లో 220 పోస్టులు, జోన్ -3లో 34 పోస్టులు, జోనల్ -4లో 94 పోస్టులు ఉన్నాయి. ఈ పోస్టులకు జనరల్ నర్సింగ్, మంత్రసాని, బి.ఎస్సీ( నర్సిగ్ ) చేసిన వారు దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తులు ఈ నెల 21 నుంచి అక్టోబరు 5 వరకు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు htpp://cfw.ap.nic.inలో పొందవచ్చు. పూర్తి చేసిన దరఖాస్తులను అక్టోబరు 5 సాయంత్రం 5 గంటల్లోపు రీజినల్ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్‌లోని సంబంధిత జోన్లలో అంద చేయాల్సి ఉంటుంది. దరఖాస్తుదారు సంబంధిత అక్నాలెడ్జ్ మెంట్ పొందాల్సి ఉంటుంది. ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు రిజర్వేషన్లు అమలు చేస్తారు. దరఖాస్తు చేసుకునే ఓ.సి అభ్యర్థులు రూ.500, ఎస్సీ, ఎస్టీ, బి.సి వికలాంగులు రూ.300 రీజినల్ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్‌లోని సంబంధిత జోన్ పేరుతో డీడీ తీయాల్సి ఉంటుంది.