Kadapa: బీటెక్ రవిపై పిటిషన్.. షాకిచ్చిన కోర్టు

by srinivas |
Kadapa: బీటెక్ రవిపై పిటిషన్.. షాకిచ్చిన కోర్టు
X

దిశ, వెబ్ డెస్క్: టీడీపీ నేత బీటెక్ రవి విషయంలో పోలీసులకు ఎదురుదెబ్బ తగిలింది. పది నెలల క్రితం జరిగిన సంఘటపై పోలీసులు కేసు నమోదు చేసి బీటెక్ రవిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తలించారు. అయితే బీటెక్ రవిని ఐదు రోజులపాటు కస్టడీకి ఇవ్వాలని పోలీసులు కడప కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై ధర్మాసనం విచారణ చేపట్టింది. అయితే ఈ పిటిషన్‌ను కోర్టు కొట్టివేసింది. విచారణను ఈ నెల 21కి వాయిదా వేసింది.

కాగా ఈ నెల 14న బీటెక్ రవిని వల్లూరు పోలీసులు అరెస్ట్ చేశారు. 10 నెలల క్రితం కడప ఎయిర్‌పోర్టులో జరిగిన ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. పాదయాత్రలో భాగంగా కడప ఎయిర్‌పోర్టు‌కు వెళ్లిన నారా లోకేశ్‌కు స్వాగతం పలికేందుకు బీటెక్ రవి యత్నించారు. అయితే పోలీసులు అడ్డుకున్నారు. దీంతో బీటెక్ రవి ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా పోలీసులకు బీటెక్ రవికి మధ్య వాగ్వాదం, తోపులాట జరిగింది. ఈ ఘటనపై వల్లూరు పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే బీటెక్ రవి అప్పటి నుంచి అందుబాటులో లేరని.. అందుకే తాజాగా అరెస్ట్ చేశామని పోలీసులు తెలిపారు. ఈ కేసులోనే బీటెక్ రవిని 5 రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలన్న పిటిషన్‌ను కడప కోర్టు కొట్టివేసింది.

Advertisement

Next Story