Penna River:పరవళ్ళు తొక్కుతున్న పెన్నా నది

by Jakkula Mamatha |   ( Updated:2024-10-17 15:18:57.0  )
Penna River:పరవళ్ళు తొక్కుతున్న పెన్నా నది
X

దిశ, కడప: వైఎస్ఆర్ జిల్లా పెన్నా నదిలో తుఫాను కారణంగా గత మూడు రోజుల నుంచి ఎగువ ప్రాంతాల్లో కురిసిన వర్షాల కారణంగా పెన్నా నదికి భారీగా వరద నీరు చేరుకుంది. లో కాజ్ వే పూర్తిగా నీటిలో మునిగి పోయింది. మండల యంత్రాంగం లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశారు. పెన్నా నది నందు నీటి మట్టం పెరగడంతో పరిసర ప్రాంతాలకు ఎవరు వెళ్లవద్దని సిద్ధవటం మండలం ఎస్సై చిరంజీవి హెచ్చరిక జారీ చేశారు. లో కాజ్ వే వద్ద వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తూ ఉందని ఆ ప్రాంతాల వద్దకు ఎవరూ వెళ్లవద్దని తెలియజేశారు. కొత్త వ్యక్తులు ఎవరైనా పెన్నా పరిసర ప్రాంతాల్లో ఉంటే సమాచారం తెలపాలని ఆయన అన్నారు.

Advertisement

Next Story

Most Viewed