చంద్రబాబు ఆదేశిస్తే చాలు.. రాజంపేట నుంచి రెడీ..!

by srinivas |   ( Updated:2024-01-05 17:17:51.0  )
చంద్రబాబు ఆదేశిస్తే చాలు.. రాజంపేట నుంచి రెడీ..!
X

దిశ, కడప: అన్నివిధాలా నష్టపోయిన రాష్ట్రాన్ని, ప్రజల ప్రయోజనాల దృష్టిలో ఉంచుకొని పొత్తులు పెట్టుకున్నామని, స్వప్రయోజనాల కోసం కాదని అన్నమయ్య జిల్లా అధ్యక్షుడు జగన్మోహన్ రాజు పేర్కొన్నారు. సుండుపల్లె టిడిపి పార్టీ కార్యాలయంలో శుక్రవారం ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. వైసీపీపై, ఆ పార్టీ నాయకుడిపై నమ్మకం లేకే నాయకులు వలసలు పోతున్నారని ఆయన వ్యాఖ్యానించారు. చంద్రబాబు ఆదేశిస్తే రాజంపేట శాసనసభ నుంచి పోటీ చేయడానికి తాను సిద్ధమన్నారు. ప్రజల నెత్తిపై ముద్దులు పెట్టి, నెరవేర్చలేని హామీలు గుప్పించి అధికారంలోకి రాగానే పాలన చేతకాక అహంకార పూరితంగా, కక్ష పూరిత నిర్ణయాలతో ప్రజలను అనగతొక్కుతున్నారని మండిపడ్డారు.

దేశంలో ఎక్కడా లేనివిధంగా ఒక నిరంకుశత్వ, నియంత పాలన రాష్ట్రంలో నడుస్తుందని ఆరోపించారు. ఇదేంటని ప్రశ్నించిన వారిపై దాడులు, ఎదురిస్తే కేసులు పెట్టి పాలన చేస్తున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని విమర్శించారు. ఇచ్చిన హామీలు నెరవేర్చలాంటూ రాష్ట్రంలో రోడ్డెక్కిన పలు శాఖల ఉద్యోగులను చూస్తుంటే అర్థమవుతుందని జగన్మోహన్ రాజు ఎద్దేవా చేశారు.

Advertisement

Next Story

Most Viewed