Ap News: వైఎస్ సునీత పులివెందుల పులి.. సీఎం జగన్ ఇలాకలో చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు

by srinivas |   ( Updated:2023-08-02 16:05:25.0  )
Ap News: వైఎస్ సునీత పులివెందుల పులి.. సీఎం జగన్ ఇలాకలో చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్ డెస్క్: వచ్చే ఎన్నికల్లో పులివెందుల సత్తా ఏంటో చూపించాలని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. పులివెందులలో ఆయన పర్యటించారు. గండికోటను సందర్శించిన చంద్రబాబు పులివెందులలో భారీ బహిరంగ సభ నిర్వహించారు. ఈ సభలో చంద్రబాబు మాట్లాడుతూ అడబిడ్డ షర్మిలకు ఆస్తిలో సగభాగం ఇవ్వలేదని సీఎం జగన్‌పై నిప్పులు చెరిగారు. పులివెందుల ఆడబిడ్డ షర్మిలకు అన్యాయం చేశారని చంద్రబాబు ధ్వజమెత్తారు.

వైఎస్ వివేకానందారెడ్డి హత్య ఉదంతాన్ని కూడా చంద్రబాబు ప్రస్తావించారు. సొంత బాబాయ్‌ను చంపేసి జగన్ బ్యాచ్ డ్రామాలాడారని మండిపడ్డారు. వైఎస్ సునీత పులివెందుల పులి అని వ్యాఖ్యానించారు. పులివెందుల ప్రజల్లో తిరుగుబాటు కనిపిస్తోందని చంద్రబాబు తెలిపారు. పులివెందుల లైవ్ తాడేపల్లిలో చూడాలి కాబట్టి ఇక్కడ సభ పెట్టానన్నారు. పులివెందుల లైవ్ చూశైనా జగన్ మారతారేమోనన్నారు. తమ నేతలు వైనాట్ పులివెందుల అని అంటున్నారని చంద్రబాబు తెలిపారు. రాయలసీమ ఆశాజ్యోతి ఎన్టీఆర్ అని, సీమలో ప్రాజెక్టులు కట్టింది టీడీపీనేనని చెప్పారు. గండికోటకు నీళ్లు తెచ్చిన ఘనత టీడీపీదేనన్నారు. సీఎం జగన్ డబ్బులు కొట్టేయడానికి గండికోటకు సొరంగం తవ్వారట అని ఎద్దేవా చేశారు. పట్టిసీమను ఎగతాళి చేసిన వ్యక్తి జగన్ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. బనకచర్లతో రాయలసీమకు గోదావరి నీళ్లివ్వాలన్నది తన జీవితాశయం అని చంద్రబాబు స్పష్టం చేశారు.

Read More : నువ్వు మంత్రివా.. సినిమా బ్రోకర్‌వా.. మంత్రి అంబటిపై చంద్రబాబు తీవ్ర విమర్శలు

Advertisement

Next Story