- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Kadapa: తండ్రి కల సాకారంపై జగన్‌కు శ్రద్ధేది..?
దిశ ప్రతినిధి, కడప: కడప, అనంతపురం జిల్లాలకు తాగునీటి సౌకర్యంతో పాటు పారిశ్రామిక, విద్యా సంస్థలకు నీటి అవసరాలు తీర్చేందుకు రూపొందించిన సోమశిల నీటి పథకం పూర్తిగా నిర్లక్ష్యానికి గురైంది. 14 ఏళ్ల క్రితం ఇక్కడకు తరలించిన నీటి పైపులు తుప్పు పట్టి పోతున్నాయి. దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి సంకల్పించిన బృహత్తర తాగునీటి పథకాన్ని పూర్తి చేయడంలో ఆయన తనయుడు ముఖ్యమంత్రి జగన్ కనీసం శ్రద్ధ చూపలేదన్న విమర్శలు వస్తున్నాయి.
సోమశిల రిజర్వాయర్ వెనుక జలాల ద్వారా కడపకు శాశ్వత తాగునీటి పరిష్కారంతోపాటు కొప్పర్తి పారిశ్రామికవాడకు పుష్కలంగా నీరు అందించాలన్న లక్ష్యంతో నీటి పథకానికి రూపకల్పన చేశారు. సోమశిల బ్యాక్ వాటర్ పథకం నుండి రెండు టీఎంసీల వరకు నీటి సరఫరా చేసే అంచనాలతో ఈ పథకాన్ని చేపట్టారు. కడప వరకు ఒక టీఎంసీ నీటిని ఉపయోగించుకునే విధంగా చేపట్టినా కడపకు శాశ్వత నీటి పరిష్కారం లభిస్తుంది. మొదటి దశగా రూ.250 కోట్లతో కడప వరకు ప్రాజెక్టు పూర్తి చేయాలని టెండర్లు పిలిచారు. పనులు కూడా మొదలు పెట్టారు. పెద్ద పెద్ద పైపులను రోడ్డు పొడవునా దించారు. ఆ తరువాత ఇప్పటి వరకు పట్టించుకోకపోవడంతో, ఆ పైపులు అలాగే తుప్పుపడుతున్నాయి. ఎంతో ఘనమైన ఆశయంతో చేపట్టిన ఈ పథకాన్ని వైఎస్ రాజశేఖర రెడ్డి మరణానంతరం వచ్చిన ముఖ్యమంత్రులు నిర్లక్ష్యం చేశారన్న విమర్శలు ఉన్నాయి. మరీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తన తండ్రి ఆశయమైన ఈ పథకం తుప్పు దులిపి సాకారం చేస్తారేమోనని ఈ ప్రాంతవాసులు ఎదురుచూసినా, అసంతృప్తినే మిగిల్చారు. రాబోవు ప్రభుత్వంలో సోమశిల నీటి పథకం కార్యరూపం దాల్చుతుందని ఆశగా ఎదురుచూస్తున్నారు