Murder: ప్రొద్దుటూరులో కలకలం.. లాడ్జిలో రౌడీ షీటర్ దారుణ హత్య

by Rani Yarlagadda |   ( Updated:2024-12-02 05:29:56.0  )
Murder: ప్రొద్దుటూరులో కలకలం.. లాడ్జిలో రౌడీ షీటర్ దారుణ హత్య
X

దిశ, వెబ్ డెస్క్: కడప జిల్లా ప్రొద్దుటూరులో రౌడీ షీటర్ దారుణ హత్యకు గురయ్యాడు. గాంధీ రోడ్డులో ఉన్న ఓ లాడ్జిలో అతడిని నరికి చంపారు. రౌడీ షీటర్ పప్పి అలియాస్ రాఘవేంద్రను దుండగులు మద్యం సీసాలతో పొడిచి హతమార్చారు. పప్పి పలు కేసుల్లో ముద్దాయిగా ఉన్నాడు. లాడ్జికి వెళ్లిన పోలీసులు.. మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు. లాడ్జి నిర్వాహకులను విచారించి, వివరాలు సేకరించారు. సమీపంలో ఉన్న సీసీటీవీ కెమెరాలను పరిశీలించి నిందితుల్ని గుర్తించే ప్రయత్నం చేస్తున్నారు. నగరంలో జరిగిన ఈ హత్య కలకలం రేపింది.

రోడ్డుప్రమాదంలో ఇద్దరు మృతి

వైఎస్సార్ జిల్లా పోరుమామిళ్ల మండలం కాల్వకట్ట వద్ద జరిగిన ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. ప్రైవేటు బస్సు ఆటోను ఢీ కొట్టడంతో ఇద్దరు మరణించగా.. మరో నలుగురికి గాయాలయ్యాయి. క్షతగాత్రుల్ని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed