Breaking: కడపలో రౌడీ షీటర్ వెంకటేశ్ దారుణ హత్య

by srinivas |
Breaking: కడపలో రౌడీ షీటర్ వెంకటేశ్ దారుణ హత్య
X

దిశ, వెబ్ డెస్క్: కడపలో దారుణం జరిగింది. రౌడీషీటర్ వెంకటేశ్ హత్యకు గురయ్యారు. వెంకటేశ్‌ను సాదిక్ వలీ అనే వ్యక్తి బీర్ బాటిల్‌తో పొడిచి చంపారు. హత్య అనంతరం పోలీసుల ఎదుట నిందితుడు వలీ లొంగిపోయారు. వెంకటేశ్‌ హత్యకు వ్యక్తిగత కక్షలే కారణమని పోలీసులు గుర్తించారు. సంఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు కేసు నమోదు చేసి వెంకటేశ్ మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు. నిందితుడిని కోర్టు ఆదేశాలతో రిమాండ్‌కు తరలించనున్నారు. అయితే ఈ హత్యతో కడప వాసులు ఒక్కసారిగా భయబ్రాంతులకు గురయ్యారు.

అయితే కడపలో జరిగిన ఈ ఘటనతో పోలీసులు అప్రమత్తమయ్యారు. కడప నగరంలో పెట్రోలింగ్ పెంచుతామన్నారు. ఏదైనా సమస్యలు ఉంటే తమను సంప్రదించాలని, దారుణాలకు పాల్పడవద్దని ప్రజలకు సూచించారు. అనుమానస్పద వ్యక్తులు సంచరించినా, గంజాయి, డ్రగ్స్‌తో పాటు ఎలాంటి నిషేధిత పదార్థాల సమాచారం తెలిసినా వెంటనే తమ దృష్టికి తీసుకురావాలని పోలీసులు కోరారు.

Advertisement

Next Story

Most Viewed