- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రాబోయే ఎన్నికల విధుల్లో వీడియో గ్రాఫర్ల బాధ్యతలు కీలకమైనవి..
దిశ,కడప: ఎన్నికల విధుల్లో భాగంగా వీడియోగ్రాఫర్లను నిర్వర్తించే బాధ్యతలు చాలా కీలకమైనవి.ప్రతి అంశాన్ని కెమెరాలో బందించాల్సిన అవసరం ఉందని జిల్లా మాస్టర్ ట్రైనర్ సురేష్ రెడ్డి పేర్కొన్నారు.బుధవారం కలెక్టరేట్ లో స్పందన హాల్ లో త్వరలో జరగనున్న సాధారణ ఎన్నికల సందర్భంగా ఎంసీఎంసీ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్, ఎన్నికల విధుల్లో వీడియో గ్రాఫర్ ల పాత్ర, వారు నిర్వర్తించాల్సిన బాధ్యతలపై వీడియోగ్రఫీ టీమ్ నోడల్ అధికారులు సురేష్ రెడ్డి, మల్లికార్జున, ఎక్స్పెండిచర్ నాగరాజు ఆధ్వర్యంలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వీడియోగ్రాఫర్ల కు అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రానున్న సార్వత్రిక ఎన్నికలు ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య ఎన్నికలని ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని తెలిపారు. ఎన్నికల్లో ప్రజలు పారదర్శకంగా స్వేచ్ఛాయుత వాతావరణంలో ఓటు వేయడానికి చేపడుతున్న భద్రతా చర్యల్లో భాగంగా, ప్రతి అంశానికి సంబంధించి పారదర్శకంగా, వీడియోలు తీయడం ద్వారా ఎక్స్పెండిచర్, సీజర్, మేనేజ్మెంట్, నామినేషన్, ఓటింగ్ సమయంలో పోలింగ్ కేంద్రాల వద్ద, కౌంటింగ్ సమయాల్లో,, ఎన్నికలకు సంబంధించిన అన్ని అంశాలలో తీసిన వీడియోలు ప్రధాన ఆధారాలుగా భద్రపరచడం జరుగుతుందన్నారు.