- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
జగన్ ప్రభుత్వం రాయలసీమ రైతాంగానికి శాపం.. నారా లోకేష్
దిశ ప్రతినిధి, కడప: రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రాయలసీమ రైతులకు శాపంగా మారిందని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ విమర్శించారు. రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ,సాగుకు అవసరమైన సహకారం ప్రభుత్వం అందించడం లేదని విమర్శించారు. తెలుగుదేశం ప్రభుత్వంలో 90 శాతం సబ్సిడీతో డ్రిప్ పరికరాలు ఇచ్చామని, ఇప్పుడు ఆ పరిస్థితి లేకుండా పోయిందని పేర్కొన్నారు. యులగళంలో భాగంగా 123 వ రోజు బద్వేల్ నియోజకవర్గం లో పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా పలు గ్రామాల వద్ద రైతులు లోకేష్ తో మాట్లాడి వారి సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. రైతుల విన్నపాలు విన్న తరువాత లోకేష్ మాట్లాడుతూ రైతులకు జగన్ ప్రభుత్వం శాపంగా మారి మారిందని విమర్శించారు. రాయలసీమలో ప్రాజెక్టులకు తెలుగుదేశం ప్రభుత్వంలో 11700 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే ఇప్పుడు అందులో నాలుగోవంతు కూడా ఖర్చు పెట్టలేదని విమర్శించారు.
ఎస్సీ ఎస్టీ నిధులు దారిమల్లించారు
జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఎస్సీ ,ఎస్టీ నిధులు కూడా దారి మళ్ళించిందని ఆరోపించారు. 28147 కోట్ల రూపాయలు దారి మళ్లించిన ద్రోహి జగన్మోహన్ రెడ్డి అని విమర్శించారు. జగన్ అధికారంలోకి వచ్చాక ఎస్సీ ఎస్టీ బీసీ కార్పొరేషన్లు నిర్వీర్యం అయ్యాయన్నారు. గిరిజనులకు జగన్ ప్రభుత్వంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని తమ ప్రభుత్వం రాగానే అడవుల్లోకి గిరిజనులు గిరిజనులు నేరుగా వెళ్లే స్వేచ్ఛ కల్పిస్తామన్నారు.
హార్టీ కల్చర్ హబ్‌గా సీమ
రాయలసీమను హార్టికల్చర్ హబ్ గా చేయడం తెలుగుదేశం ప్రభుత్వ లక్ష్యమని నారా లోకేష్ అన్నారు .రెడ్డివారిపల్లె వద్ద చీనీ రైతులు లోకెష్ ను చీనీ తోటలో పరిశీలనకు తీసికెళ్ళారు.ఈ సందర్భంగా రైతులు లోకేష్ తో మాట్లాడుతూ సమస్యలు వివరించారు.వారి సమస్యలు విన్న లోకేష్ మాట్లాడుతూ రైతులు ఆర్టికల్చర్ పంటలను సాగు చేసి నష్టపోకుండా ఉండేందుకు తెలుగు దేశం ప్రభుత్వం రాగానే ఆదుకుంటామన్నారు.రైతులను ఆదుకునేందుకు నాకు కొన్ని ఆలోచనలు ఉన్నాయని ఈ సందర్భంగా చెప్పారు. రైతులకు 90 శాతం సబ్సిడీతో డ్రిప్ సౌకర్యం కల్పించడం తో పాటు పండించిన ఉత్పత్తులను నిల్వ ఉంచు కొనేందుకు కోసం కోల్డ్ స్టోరేజ్ లు ఏర్పాటు చేస్తామని అన్నారు.అలాగే మార్కెటింగ్ సౌకర్యం కల్పిస్తామన్నారు.లోకేష్ తో చీని రైతు రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ ఎనిమిది టన్నుల చీనీ కాయలు దిగుబడి రావడం గుణంగా రమారిందని, 30 నుంచి 40 వేల రూపాయలు ధర ఉంటే కానీ గిట్టుబాటు కాదని తెలిపారు.
ప్రస్తుతం 15 నుంచి 20వేలు మాత్రమే ధర పలుకతుందన్నారు.దీంతో తీవ్రంగా నష్టపోతున్నామని వివరించారు. ఇందుకు లోకేష్ స్పందిస్తూ తెలుగు దేశం ప్రభుత్వం ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పండ్లు తోటలో రైతులతో పాటు రైతులందరికీ గిట్టుబాటు ధర కల్పిస్తామని, అలాగే కోల్డ్ స్టోరేజ్ ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు .ఏడాది ఓపిక పట్టండి అధికారంలోకి వస్తాము .రైతులను ఆదుకుంటామని పేర్కొన్నారు. జగన్ ప్రభుత్వం రైతులను పట్టించుకోవడం లేదని విమర్శించారు. సోమశిల మునక ప్రాంత రైతుల సమస్యలు కూడా జగన్ ప్రభుత్వం పట్టించుకోకపోవడం లేదని విమర్శించారు. తాను సోమశిల రైతుల పరిహారం కోసం ప్రభుత్వానికి లేఖ రాస్తారని పేర్కొన్నారు.
అడుగడుగునా బ్రహ్మరథం
నారా లోకేష్ 123వ రోజు యువగళం పాదయాత్రకు అడుగడుగునా ప్రజలు, అభిమానులు ,బ్రాహ్మ రధం పట్టారు. గజమాలలతో సత్కరించారు .ఆయనతో పాటు అడుగులు ఉత్సాహంగా నడిచారు .ప్రతి గ్రామం వద్ద తెలుగుదేశం పార్టీ నాయకులు స్వాగత కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. శనివారం మధ్యాహ్నం రెండు గంటలకు నదియాబాద్ క్యాంప్ సైట్లో రైతులతో ముఖాముఖిలో పాల్గొన్నారు. నాలుగు గంటల నుంచి పాదయాత్ర ప్రారంభించారు .పాదయాత్రలో సోమేశ్వరపురం రైతులు తో ఎర్రబల్లిలో విద్యార్థులతో అప్పారావుపేట గ్రామస్తులతో రాజుపాలెం వాసులతో మాట్లాడారు. అలాగే వెంకటశెట్టిపల్లి, శివరాం నగర్, శంకరాపురం, గొడుగునూరు, చింతలచెరువు ,బైనపల్లి వద్ద రైతులు,స్థానికులతో సమావేశం అయ్యారు. అనంతరం రాత్రి 8.15 గంటలకు బద్వేలు శివారులోని విద్యానగర్లో విడిది చేశారు. లోకేష్ వెంట మాజీ ఎమ్మెల్యే విజయమ్మ ఆయన కుమారుడు రితీష్ రెడ్డిలతో పాటు పలువురు దేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు.