- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అన్నమయ్య జిల్లా రద్దు.. క్లారిటీ ఇచ్చిన ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి
దిశ, కడప: జిల్లాల పునర్విభజన వార్తలు పూర్తి నిరాధారమని అన్నమయ్య జిల్లా రాయచోటి ఎమ్మెల్యే జి శ్రీకాంత్ రెడ్డి తెలిపారు. రాయచోటి అన్నమయ్య జిల్లాను రద్దు చేస్తున్నారన్న తప్పుడు ప్రచారాలను నమ్మవద్దన్నారు. కొంతమంది ప్రభుత్వానికి వ్యతిరేకంగా, ప్రాంతాలకు వ్యతిరేకంగా మాధ్యమాలు, పత్రికలు సోషల్ మీడియా ద్వారా తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని పేర్కొన్నారు. జిల్లాల పునర్విభజన ప్రచారంలో ఒక్క శాతం కూడా నిజం కాదని స్పష్టం చేశారు. రాయచోటిలో జిల్లా కేంద్రం వుండకూడదని కొంతమంది దురుధ్యేశ్యంతో విష ప్రచారం చేస్తున్నారని శ్రీకాంత్ రెడ్డి మండిపడ్డారు.
ఊపిరి ఉన్నంత వరకు రాయచోటి జిల్లా కేంద్రంగానే ఉంటుందని, రాయచోటి నుంచి ఒక్క అడుగు కూడా దాటిపోకుండా చూస్తామని శ్రీకాంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ రోజు జరిగిన క్యాబినెట్ సమావేశంలో ఈ అంశంపై కనీసం చర్చ కానీ, అజెండా కానీ లేదని తెలిపారు. కేవలం ఊహాజనితంగా రాసిన వార్తలుగా అవి అన్నారు. వంద, రెండు వందల సంవత్సరాలకు రాని జిల్లా కేంద్ర అవకాశాన్ని ముఖ్యమంత్రి వై.ఎస్ జగనమోహన్ రెడ్డి కల్పించారన్నారు. ప్రజల దీవెనలు, ముఖ్యమంత్రి ఆశీస్సులతో రాయచోటి జిల్లా కేంద్రం యధావిధిగా కొనసాగుతుందని ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి స్పష్టం చేశారు.