వివేకా హత్య కేసులో కీలక పరిణామం..శివశంకర్ రెడ్డి కి బెయిల్

by Jakkula Mamatha |   ( Updated:11 March 2024 2:55 PM  )
వివేకా హత్య కేసులో కీలక పరిణామం..శివశంకర్ రెడ్డి కి బెయిల్
X

దిశ,కడప:వైఎస్ వివేకా హత్య కేసులో నిందితుడు గా ఉన్న దేవిరెడ్డి శివ శంకర్ రెడ్డి కి బెయిల్ మంజూరు అయింది.రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో అరెస్టయిన నిందితుడు దేవిరెడ్డి శివశంకర్ రెడ్డికి బెయిల్ లభించింది. షరతులతో కూడిన బెయిల్‌ను తెలంగాణ హైకోర్టు మంజూరు చేసింది.అయితే బెయిల్ మంజురూ చేస్తూ కొన్ని షరతులు పెట్టింది.అవి కచ్చితంగా పాటించలాని ఆర్డర్ వేసింది.షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేస్తూ ఆదేశాలిచ్చింది. శివ శంకర్ రెడ్డి రెండు లక్షలు, రెండు షూరిటీ లు సమర్పించాలనే షరతులు పెట్టడం తో పాటు హైదరాబాద్ విడిచి వెళ్ళడానికి వీల్లేదన్న శ్రుతులు విధించింది.అలాగే పాస్ పోర్ట్ సరెండర్ చేయ్యాలని ఆదేశాలిచ్చింది.ప్రతి సోమవారం హైదరాబాద్ సీసీఎస్ పోలీసుల ముందు హాజరు కావాలని తెలంగాణ హైకోర్టు ఆదేశాలిచ్చింది.

Read More..

Viveka murder case: దేవిరెడ్డి శివ శంకర్ రెడ్డికి బెయిల్ మంజూరు

Next Story

Most Viewed