Kadapa: డిప్యూటీ అంజద్ బాషాను ఇంటికి పంపుతాం..!

by srinivas |   ( Updated:2023-10-03 18:28:49.0  )
Kadapa: డిప్యూటీ అంజద్ బాషాను ఇంటికి పంపుతాం..!
X

దిశ, కడప: వచ్చే ఎన్నికల్లో ఉపముఖ్యమంత్రి అంజాద్ బాషాను ఇంటికి పంపుతామని, వైసీపీకి ఘోర పరాజయం తప్పదని కడప అసెంబ్లీ టీడీపీ ఇంచార్జి మాధవరెడ్డి హెచ్చరించారు. కడపలో ఆమె మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు అరెస్ట్‌ను నిరసిస్తూ సత్యమేవ జయతే పేరుతో ఒక్క రోజు దీక్ష చేస్తుంటే పోలీసులు భగ్నం చేయాలని చూశారని మండిపడ్డారు. ఒక్క ఛాన్స్ అని అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం అరాచకాలకు ప్రాధాన్యం ఇస్తోందన్నారు. ఇలాంటి వైసీపీకి రానున్న ఎన్నికల్లో ఘోర పరాజయం తప్పదని జోస్యం చెప్పారు. అదీక్ష చేస్తున్న టీడీపీ శిబిరాన్ని రాత్రికి రాత్రి పోలీసులు భగ్నం చేశారని మండిపడ్డారు. డిప్యూటీ సీఎం అంజాద్ బాషాకు కాలం చెల్లిందని, కపక్షంగా వ్యవహరించే పోలీసులను వదిలే ప్రసక్తేలేదని కడప అసెంబ్లీ టీడీపీ ఇంచార్జి మాధవరెడ్డి హెచ్చరించారు.

Advertisement

Next Story

Most Viewed