- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Kadapa: హత్య కేసులో ఐదుగురికి జీవిత ఖైదు
దిశ, కడప: వ్యక్తిని హత్య చేసిన కేసులో ఐదుగురు ముద్దాలకు కడప ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ సెషన్స్ కోర్టు జీవిత ఖైదు విధించింది. కడప రాజారెడ్డి వీధికి చెందిన దిద్దుకుంట లోకేశ్వరరెడ్డి అలియాస్ లోక అనే యువకుడు దారుణ హత్యకు గురయ్యారు. 2014, ఫిబ్రవరి14న మోటార్ సైకిల్‌పై లోకేశ్వర రెడ్డి వెళ్తుండగా లాయం సుధా హరినాధ్, మురహరి విజయ్ కుమార్, బాతుల సాయి ప్రశాంత్, బీమోళ్ల నరసింహ, ములక లోకొద్దారక రెడ్డి టాటా సుమోతో ఢీకొట్టారు. కింద పడ్డ లోకేశ్వరరెడ్డిపై వేటకొడవళ్లతో విచక్షణా రహితంగా నరికి చంపారు. ఆ తర్వాత ముద్దాయిలను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినారు. అప్పటి కడప I టౌన్ సిఐ యస్. మహబూబ్ బాషా ఛార్జ్ షీట్ దాఖలు చేశారు. ఈ కేసు పూర్వోపరాలు విచారించిన కోర్టు ముద్దాయిలకు జీవిత ఖైదును విధించడంతో పాటు ఒక్కొక్కరికి 3 వేలు చొప్పున రూ. 15 వేలు జరిమానా చెల్లించాలని ఆదేశించింది.