- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Kadapa: కేరళ డీజీపీగా కడప జిల్లా వాసి
దిశ, కడప: కేరళ రాష్ట్రం పోలీస్ శాఖలో అత్యున్నత స్థాయి పదవి అయిన డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (DGP)గా కడప జిల్లా పోరుమామిళ్ల నివాసి దర్వేష్ సాహెబ్ పదవి బాధ్యతలు స్వీకరించారు. దర్వేష్ సాహెబ్ పుట్టి పెరిగిన ఊరు పోరుమామిళ్ల కాగా ఆయన తండ్రి ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్‌లో ఉద్యోగం చేశారు. పోరుమామిళ్ల పంచాయతీ ఆఫీస్ వెనక బెస్తవీధిలో నివాసించారు. ఒకటవ తరగతి నుంచి 5వ తరగతి వరకు దర్వేష్ సాహెబ్ పోరుమామిళ్ల ఓఎల్‌ఎఫ్ పాఠశాలలో చదివారు. ఆరు నుంచి ఇంటర్ వరకు పట్టణంలోని గవర్నమెంట్ జూనియర్ కాలేజ్‌లో చదువుకున్నారు. డిగ్రీ, పీజీ తిరుపతిలో చదివారు.
ఐఏఎస్ సాధించాలని పట్టుదలతో ఎంతో కష్టపడి ఎగ్జామ్స్ రాయగా మొదటిసారి ఇండియన్ ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్‌లో సెలెక్ట్ అయ్యారు. దాన్ని వదులుకొని మరోసారి ఐఏఎస్‌కు ప్రిపేర్ అయ్యారు. ఈసారి ఐపీఎస్‌గా సెలెక్ట్ కావడంతో కేరళ రాష్ట్రంలో తన ఉద్యోగాన్ని మొదలుపెట్టారు. అంచలంచెలుగా ఎదిగి జిల్లా ఎస్పీ నుంచి డీఐజీ, ఐజీగా పదవులు పొంది నేడు కేరళ స్టేట్‌కు డీజీపీగా నియమించబడ్డారు. దర్వేష్ సాహెబ్‌ను కర్ణాటక డీజీపీగా నియామకంకావడంతో పోరుమామిళ్లలోని స్నేహితులు, బంధువులు, ప్రజలు ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.