Kadapa: హౌసింగ్ ఉద్యోగి ఆత్మహత్యాయత్నం

by srinivas |
Kadapa: హౌసింగ్ ఉద్యోగి ఆత్మహత్యాయత్నం
X

దిశ, కడప: అన్నమయ్య జిల్లా రాయచోటి కలెక్టరేట్ కార్యాలయ ప్రాంగణంలో హౌసింగ్ వర్క్ ఇన్స్‌పెక్టర్ రమేష్ నాయక్ పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డారు. నారాయణ రెడ్డిగారిపల్లె జగనన్న కాలనీకి వినియోగించిన ఇసుకలో అవినీతి అవకతవకలు జరిగాయని వర్క్ ఇన్స్‌పెక్టర్లు హరి ప్రసాద్, రమేష్ నాయక్ పరస్పరం ప్రాజెక్టు డైరెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. అయితే హౌసింగ్ పీడీ ఎదుటే రమేష్ నాయక్‌ను వర్క్ ఇన్స్‌పెక్టర్ హరి చంపుతానని బెదిరించారు. దీంతోమనస్థాపానికి గురైన రమేష్ నాయక్ ఒంటిపై పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య ప్రయత్నం చేశారు. అయితే ఇన్స్‌పెక్టర్‌ను స్థానికులు అడ్డుకోవడంతో తనకు న్యాయం జరిగే వరకు కదిలేదని అక్కడే బైఠాయించి ఆందోళన వ్యక్తం చేశారు.

Advertisement

Next Story

Most Viewed