- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నేను ఎమ్మెల్యే అవుతా: రమేష్ కుమార్ రెడ్డి
దిశ, కడప: తాను ఎమ్మెల్యేను అవుతానని, చంద్రబాబును ముఖ్యమంత్రిని చేస్తానంటూ టీడీపీ మాజీ ఎమ్మెల్యే ఆర్ రమేష్ కుమార్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. తాను 9 నుంచి 10 ఏళ్లుగా రాయచోటి ఇన్చార్జిగా ఉన్నానని, ఎంతోమంది పార్టీలోకి వస్తున్నారని తెలిపారు. వారికి స్వాగతం పలుకుతా ఉంటామని చెప్పారు. టిక్కెట్టు వ్యవహారం పార్టీ అధినేత చూసుకుంటారన్నారు. ఎవరికి ఏ స్థానం ఇవ్వాలో చంద్రబాబుకు బాగా తెలుసని చెప్పారు. ‘ఇక్కడ ఎవరు రగడ చేసే వారు లేరు. నేను ఎమ్మెల్యేను అవుతా. చంద్రబాబుని ముఖ్యమంత్రి చేస్తా. ఇది నూటికి నూట యాభై శాతం జరుగుతుంది.’ అని రాయచోటి ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే రమేష్ కుమార్ రెడ్డి దీమా వ్యక్తం చేశారు.
రైతులను నట్టేట ముంచిన ప్రభుత్వం
వర్షాలు సరిగా కురవకపోవడంతో అన్నదాతలకు ప్రత్యామ్నాయం, సహాయక చర్యలు చేపట్టకుండా ఈ ప్రభుత్వం వారిని నట్టేట ముంచిందని రమేష్ కుమార్ రెడ్డి విమర్శించారు. ప్రభుత్వం దోచుకో దాచుకో అన్న చందంగా తయారైందని ఆయన ఆరోపించారు. టిడ్కో ఇళ్లకు రంగులేసి తామే కట్టించామని చెబుతారేమోనని అనుమానం వ్యక్తం చేశారు. హంద్రీ నీవా ప్రాజెక్ట్ పనులు కనీసం ఒక గంప మట్టి కూడా వేయలేదని తెలిపారు. 3వేల కోట్ల రూపాయల నిధులు దేనికి ఖర్చు పెట్టారో చెప్పే దమ్ము వారికి లేదని విమర్శించారు. రాయచోటిలో అభివృద్ధి పనులు ఎక్కడ చేశారో చెప్పాలని వైసీపి నేతలను రమేష్ కుమార్ రెడ్డి ప్రశ్నించారు.
‘పోలీసులను అడ్డుపెట్టుకుని వైసీపీ రాజ్యమేలుతోంది. అవినీతి చక్రవర్తులకు బుద్ధి చెప్పే రోజులు దగ్గర పడ్డాయి. టీడీపీ అధికారంలోకి వస్తుందని, రాయచోటిలో జరిగిన అవినీతిపై కఠిన చర్యలు తీసుకుంటాం. రాయచోటికి ఇంఛార్జిగా కొనసాగుతూ వచ్చే ఎన్నికల్లో గెలిచి ఎమ్మెల్యే అవుతా.. రేవంత్ రెడ్డి తనకు చిరకాల మిత్రుడని ఆయన్ను సాదరంగా కలిసేందుకు వెళ్ళా.’ అని రమేష్ కుమార్ రెడ్డి తెలిపారు