- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Ap News: ఈ నెల 16 నుంచి ఈవీఎంలు, వీవీ ప్యాట్స్ ఫస్ట్ లెవెల్ చెకింగ్
దిశ, కడప: ఈనెల 16 నుంచి నిర్వహించే ఈవీఎంలు, వివి ప్యాట్స్ ఫస్ట్ లెవెల్ చెకింగ్ కార్యక్రమానికి గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులు హాజరుకావాలని రాజకీయ పార్టీ నాయకులకు కలెక్టర్ గిరీష పిఎస్ సూచించారు. కలెక్టరేట్‌లోని మినీ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నందు జిల్లా కలెక్టర్ గిరీష పిఎస్, ఈవీఎంలు, వివి ప్యాట్స్ ఫస్ట్ లెవెల్ చెకింగ్ (ఎఫ్ఎల్సి)పై వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఓటింగ్ యంత్రాల ఫస్ట్ లెవెల్ చెకింగ్ (ఎఫ్ఎల్సి)లో ప్రతి ఒక్కరూ ఎన్నికల కమిషన్ నియమ నిబంధనలు తూచా తప్పకుండా పాటించాలన్నారు. ఈనెల 16వ తేదీ నుంచి దాదాపు 20 రోజులు పాటు ఓటింగ్ యంత్రాల చెకింగ్ కార్యక్రమం ఉంటుందన్నారు. ఇందులో చిన్న తప్పు జరగడానికి వీలు లేదన్నారు. రాయచోటిలోని మార్కెట్ యార్డు వద్ద ఈవీఎం గోడౌన్లలో నిర్వహించే ఫస్ట్ లెవెల్ చెకింగ్ ప్రక్రియ కోసం అవసరమైన సీసీ కెమెరాలు, వెబ్ క్యాస్టింగ్, పటిష్ట పోలీసు బందోబస్తు, కంట్రోల్ రూమ్ తదితర ఏర్పాట్లు చేపట్టడం జరుగుతుందన్నారు.
ఈ కార్యక్రమాన్ని సజావుగా నిర్వహించేందుకు అన్ని రాజకీయ పార్టీలు పూర్తి సహాయ సహకారాలు అందించాలన్నారు. చెకింగ్ హాల్లోకి సెల్ ఫోన్‌లు, అనుమతి లేదన్నారు. జిల్లాలోని గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలు తమ పార్టీ తరఫున ఏడు మందికి సంబంధించిన ఫోటోలు ఆథరైజేషన్ లెటర్ వెంటనే ఇవ్వాలన్నారు. ప్రతి ఒక్కరికి గుర్తింపు కార్డులు జారీ చేయడం జరుగుతుందని చెకింగ్ హాల్లోకి వచ్చేవారు తప్పక గుర్తింపు కార్డు ఉండాలని గిరీష పిఎస్ పేర్కొన్నారు.