- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Vontimitta: ముగిసిన కోదండరామస్వామి బ్రహ్మోత్సవాలు
దిశ, కడప: ఒంటిమిట్ట కోదండరామ స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు ముగిశాయి. కీలక ఘట్టం ధ్వజావరోహణం వైభవంగా జరిగింది. దీంతో కోదండరామస్వామివారి బ్రహ్మోత్సవాలు ముగిశాయి. కాగా స్వామి వారికి శనివారం (ఈరోజు) ఉదయం పుష్కరిణిలో చక్రస్నానం నేత్రపర్వంగా జరిగింది. విశేష సంఖ్యలో భక్తులు పాల్గొని పుణ్యస్నానాలు ఆచరించారు. ఆలయంలో ఉదయం 4 గంటలకు సుప్రభాతంతో స్వామి వారిని మేల్కొలిపి ఆలయ శుద్ధి, ఆరాధన నిర్వహించారు.
ఉదయం 9.30 గంటలకు లక్ష్మణ సమేత సీతారాములవారు తిరుచ్చిలో, సుదర్శన చక్రత్తాళ్వార్ పల్లకిలో ఊరేగింపుగా పుష్కరిణి వద్దకు వేంచేశారు. ఉదయం 10.30 నుండి 11 గంటల వరకు స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులకు వేడుకగా స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఇందులో సీతారామ లక్ష్మణ సరసన చక్రత్తాళ్వార్లు పాలు, పెరుగు, తేనె, పసుపు, చందనంతో అభిషేకాలు అందుకున్నారు. అనంతరం అర్చకులు వేదమంత్రోచ్ఛారణ నడుమ శాస్త్రోక్తంగా చక్రస్నానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డెప్యూటీ ఈవో నటేష్ బాబు, సూపరింటెండెంట్ సుబ్రహ్మణ్యం, టెంపుల్ ఇన్సపెక్టర్ ధనుంజయ, ఆలయ అర్చకులు పాల్గొన్నారు.