- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Kadapa: మహిళా డాక్టర్‌ను వెంటాడిన ఆకతాయి.. ఆట కట్టించిన దిశ పోలీసులు
దిశ, కడప: మహిళా డాక్టర్ వెంటపడి వేధిస్తున్న వ్యక్తి ఆట కట్టించారు దిశ పోలీసులు. కొన్ని రోజులుగా ఓ వ్యక్తి తనను ఫాలో చేస్తూ ఇబ్బంది పెడుతున్నట్లు బాధితురాలు దిశ యాప్‌కు కాల్ చేసింది. మఫ్టీలో మహిళను అనుసరించి ఆకతాయిని అదుపులోకి తీసుకున్నారు. ఈ సంఘటన కడప జిల్లా చాపాడు పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది.
బాధిత మహిళ చాపాడులోని ఓ ఆసుపత్రిలో డాక్టర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. కొన్ని రోజులుగా అజ్ఞాత వ్యక్తి తనను అనుసరిస్తున్నట్లు మహిళా డాక్టర్ గుర్తించారు. ఈ నేపథ్యంలో మూడు రోజుల క్రితం ఆసుపత్రికి వెళుతున్న తనను అజ్ఞాత వ్యక్తి వెంటపడి వేధించారు. దీంతో బాధిత మహిళ దిశ యాప్‌కు కాల్ చేసి సహాయం కోరారు. డాక్టర్ నుంచి దిశ యాప్ కు కాల్ వచ్చిన ఎనిమిది నిమిషాల వ్యవధిలోనే సంఘటనా స్థలానికి పోలీసులు చేరుకున్నారు. పోలీసులు వెళ్లే సమయానికి అజ్ఞాత వ్యక్తి సంఘటనా స్థలం నుంచి వెళ్ళిపోయారు. దీంతో దిశ పోలీసులు జరిగిన ఘటనపై ప్రత్యేక నిఘా పెట్టారు.
మహిళా డాక్టర్ ఫిర్యాదు ఇచ్చిన తరుణంలో ఇద్దరు కానిస్టేబుళ్లు మఫ్టీలో ప్రతి రోజు అనుసరించండం జరిగింది. ఈ క్రమంలో గురువారం ఉదయం ఆసుపత్రికి వెళ్తున్న మహిళను పోకిరీ వెంటబడి వేధించారు. మఫ్టీలో ఉన్న ఇద్దరు కానిస్టేబుల్స్ ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకొని ప్రశ్నించారు. మహిళా డాక్టర్ వెంటపడి వేధిస్తున్న వ్యక్తిని కోన మోహన్‌గా పోలీసులు గుర్తించారు. తెలియక తప్పు చేశాను, క్షమించమని మహిళా డాక్టర్‌ను మోహన్ ప్రాధేయపడ్డారు. బాధిత మహిళ సూచన మేరకు కోన మోహన్‌కు దిశ పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చారు. మరొకసారి మహిళ వెంటపడి వేధిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అదేవిధంగా మహిళా డాక్టర్‌కు ఎప్పుడు ఆపద వచ్చినా అండగా ఉంటామని దిశ పోలీసులు హామీ ఇచ్చారు.