అమరజీవి పొట్టి శ్రీరాములు విగ్రహావిష్కరణ చేస్తున్న ఉప ముఖ్యమంత్రి

by Jakkula Mamatha |
అమరజీవి పొట్టి శ్రీరాములు విగ్రహావిష్కరణ చేస్తున్న ఉప ముఖ్యమంత్రి
X

దిశ, కడప: ఆంధ్ర రాష్ట్ర పితామహుడు అమరజీవి పొట్టి శ్రీరాములు 15 అడుగుల కాంస్య విగ్రహాన్ని కడపలో ఉప ముఖ్యమంత్రి అంజద్ బాషా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అమరజీవి విగ్రహ ఆవిష్కరణ మా అదృష్టంగా భావిస్తున్నామని చెప్పారు. బుధవారం స్థానిక గోకుల్ సర్కిల్ వద్ద 25 వ డివిజన్ కార్పొరేటర్ సూర్యనారాయణ రావు ఆధ్వర్యంలో ఆంధ్ర రాష్ట్ర పితామహుడు అమరజీవి పొట్టి శ్రీరాములు కాంస్య విగ్రహం ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది

నగర మేయర్ కే. సురేష్ బాబు మాట్లాడుతూ గతంలో ఎన్నడూ లేని విధంగా కడప నగరాన్ని రూ 2500 కోట్లతో అభివృద్ధి చేయడం జరుగుతుందని చెప్పారు. గతంలో ఏ ప్రభుత్వం కూడా ఇంత అభివృద్ధి జరగలేదని ఒక్క రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలోనే అభివృద్ధి జరుగుతుందని చెప్పారు. ఎమ్మెల్సీ ఎం. రామచంద్ర రెడ్డి మాట్లాడుతూ మంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో సంక్షేమంతో పాటు అభివృద్ధి కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయని ఒక్క జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో అభివృద్ధి సాధ్యమని అన్నారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర సోషల్ వెల్ఫేర్ బోర్డు చైర్మన్ పులి సునీల్ కుమార్, కార్పొరేటర్, మున్సిపల్ అసిస్టెంట్ కమిషనర్ రాకేష్ చంద్ర, ఆర్యవైశ్య సంఘం గుప్ప చంద్రశేఖర్, మునగ శ్రీనివాసులు యనమల రమణయ్య, ముల్లంగి కృష్ణమూర్తి, పలుకు సుబ్బరాయుడు, వైసిపి నాయకులు నారపురెడ్డి సుబ్బారెడ్డి, తోట కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story