- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Viveka Case: అందుకే నిజం చెప్పా.. నన్ను కాపాడండి: దస్తగిరి
దిశ, డైనమిక్ బ్యూరో: ముఖ్యమంత్రి వైఎస్ జగన్, కడప ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డిల నుంచి తనకు ప్రాణమాని ఉందని దస్తగిరి ఆరోపించారు. వైఎస్ వివేకా హత్యకేసులో అప్రూవర్‌గా మారిన దస్తగిరి ఎర్రగుంట్లలో సోమవారం మీడియాతో మాట్లాడారు. వైఎస్ జగన్, అవినాశ్‌ల నుంచి ఇప్పటికీ ప్రమాదం పొంచి ఉందని చెప్పుకొచ్చారు. తాను అప్రూవర్‌గా మారారని, చాలా మంది తనపై విమర్శలు చేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అప్రూవర్‌గా మారేవేళ అవినాశ్ లాంటి వాళ్లు ఎందుకు ప్రశ్నించలేదని నిలదీశారు.
‘మీ వరకు రానంతవరకు దస్తగిరి మంచోడు.. మీ వరకు వచ్చేసరికి ఇప్పుడు చెడ్డవాడినా?’ అని ప్రశ్నించారు. వైఎస్ సునీత, సీబీఐ నుంచి తాను రూపాయి కూడా తీసుకోలేదని చెప్పుకొచ్చారు. ఆ అవరసం రాదని చెప్పారు. అప్పుడు డబ్బుకు ఆశపడే ఎర్రగంగిరెడ్డి చెప్పినట్లు చేశామని..ఇప్పుడు తనకు ఆ అవసరం లేదని వెల్లడించారు. కాబట్టి సీబీఐకి జరిగిన వాస్తవం ఏంటో చెప్పానని వెల్లడించారు. పలుకుబడి ఉందని సీబీఐ ఎస్పీ రామ్‌సింగ్‌ను కూడా మార్చేశారని చెప్పారు. రామ్ సింగ్‌ను మార్చితే కొత్త బృందం కొత్తకోణంలో విచారిస్తుందా? అని సందేహం వ్యక్తం చేశారు. వివేకా హత్యకేసులో మీ పాత్ర తెలుసు కనుక ఎవరైనా అలాగే దర్యాప్తు చేస్తారని దస్తగిరి సెటైర్లు వేశారు.
Read more: