- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Kadapa: చంద్రబాబు కార్యక్రమానికి అపూర్వ ఆదరణ
దిశ, కడప: కడపలో తెలుగు దేశం పార్టీ నేతలు చేపట్టిన ‘బాబుతో నేను’కార్యక్రమానికి ప్రజలు నుంచి పెద్ద ఎత్తున స్పందన లభించింది. చంద్రబాబు అక్రమ అరెస్ట్, భవిష్యత్తుకి గ్యారెంటీ పథకాలపై నగరంలోని అలంకానిపల్లెలోని దండు నుండి కమల్‌నగర్ వరకు ప్రజలకు టీడీపీనేతలు వివరించారు. అయితే ఈ కార్యక్రమంలో అడుగడుగునా టీడీపీ నేతలకు అపూర్వ స్పందన లభించింది.
ఈ సందర్భంగా కడప జిల్లా పరిషత్ మాజీ వైస్ చైర్మన్ ఆలంకానిపల్లె లక్ష్మీ రెడ్డి, టిడిపి సీనియర్ నాయకులు అమీర్ బాబు, మాజీ సింగల్ విండో అధ్యక్షులు మన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ మే నెలలో జరిగిన మహానాడులో జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు పేదలకు ఆరు మేనిఫెస్టో పథకాలు ప్రకటించడం జరిగిందన్నారు.అందులో ఒకటి ప్రతి ఇంటికి నాలుగు సిలిండర్లు, ప్రతి ఇంట్లో మహిళలు ఎంతమంది ఉన్నా కూడా 1500 రూపాయలు చొప్పున నెలకు ఆర్థికంగా తోడ్పడటానికి వాగ్దానం చేయడం జరిగిందని, తర్వాత మహిళలు ఎక్కడైనా కూడా ఉచితంగా బస్సులో ప్రయాణించడానికి చంద్రబాబునాయుడు హామీ ఇవ్వడం జరిగిందన్నారు. విద్యార్థులకు నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి 3000 రూపాయలు ప్రతినెలా ఇవ్వడం జరిగిందని, తల్లికి వందనం కింద ప్రతి కుటుంబంలో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి 15000 చొప్పున ఇవ్వడం జరుగుతుందంటూ దేశం మానిఫెస్టో పధకాలను ప్రజలకు వివరించారని తెలిపారు.