- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రోడ్డుకు అడ్డంగా కారు.. పక్కకు తీయమన్న బస్సు డ్రైవర్‌పై విచక్షణా రహితంగా దాడి
దిశ, వెబ్ డెస్క్: ఏపీలో ఆర్టీసీ బస్సు డ్రైవర్లపై దాడు కొనసాగుతున్నాయి. వాహనాలు పక్కకు తీయమన్నందుకో, హార్ కొడితే పక్క జరగలేదన్న కారణాలతో బస్సు డ్రైవర్లపై కొందరు దుండగులు రెచ్చిపోతున్నారు. వందలమంది ప్రయాణికులకు సురక్షితంగా గమ్య స్థానాలకు చేర్చే వ్యక్తి అనే విషయం కూడా మర్చిపోయి విచక్షణా రహితంగా ప్రవర్తిస్తున్నారు. ఇటీవల రెండు ఘటనలు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. ఈ ఘటనలు మరువకముందే మరో ఘటన కలకలం రేపింది.
అన్నమయ్య జిల్లా రాయచోటిలో దారుణం జరిగింది. రోడ్డుపై అడ్డంగా ఉన్న కారును పక్కకు తీయమన్నందుకు ఆర్టీసీ డ్రైవర్‌పై అనుచితంగా ప్రవర్తించారు. బూతులు తిడుతూ దాడి చేశారు. బస్సు కడప నుంచి బెంగుళూరుకు వెళ్తోంది. అయితే రాయచోటి శివారులో రోడ్డుపై ఓ కారు అడ్డంగా ఉంది. దీంతో బస్సు డ్రైవర్ కారును పక్కకు తీయాలని కారు డ్రైవర్‌కు సూచించారు. దీంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగి ఘర్షణకు దారి తీసింది. కోపోద్రికుడైన కారు డ్రైవర్, అతని అనుచరులతో కలిసి ఆర్టీసీ బస్సు డ్రైవర్, అతని అటెండర్‌పై పిడిగుద్దులు కురిపించారు. వెంటనే అక్కడి నుంచి పారిపోయారు. అయితే వీరి దాడిలో బస్సు డ్రైవర్‌తో పాటు, అటెండర్‌కు గాయాలయ్యాయి. ప్రస్తుతం వీరికి ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఆర్టీసీ బస్సు డ్రైవర్ ద్వారా ఫిర్యాదును స్వీకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
అయితే ఆర్టీసీ కార్మిక సంఘాలు ఈఘటనను ఖండించాయి. నిందితులను గుర్తించి వెంటనే శిక్షించాలని డిమాండ్ చేశారు. ఆర్టీసీ డ్రైవర్లకు భద్రత కల్పించాలని కోరారు.