- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Ap News: ప్రేమికుడికి ప్రేయసి తల్లి కండీషన్ .. ఒప్పుకోకపోడంతో దారుణం
దిశ, డైనమిక్ బ్యూరో : ఆ ఇద్దరు ప్రేమించుకున్నారు. అయితే వారి పెళ్లికి యువతి తరపు వాళ్లు అంగీకరించలేదు. ఎందుకంటే కులాంతర, మతాంతర వివాహం కావడంతో అందుకు అంగీకరించలేదు. అయితే అమ్మాయి ఒత్తిడితే ఆమె తల్లి ప్రేమికుడికి కండీషన్ పెట్టింది. మతం మారితే పెళ్లి చేస్తానని షరతు పెట్టింది. అందుకు ససేమిరా అనడంతో అతడిపై కత్తితో దాడికి దిగింది. ఈ ఘటన అన్నమయ్య జిల్లా మదనపల్లె కురబలకోట మండలంలో జరిగింది. చేనేత నగర్‌కు చెందిన రెడ్డి ప్రసాద్ ఓ ముస్లిం యువతిని ప్రేమించాడు.
అయితే ఇద్దరు.. పెద్దలని ఒప్పించి, పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. వీరి పెళ్లికి యువతి తల్లి రిహానా అంగీకరించలేదు. అయితే పదే పదే ఒత్తిడి పెంచడంతో రిహానా..ప్రసాద్‌కి ఓ కండీషన్ పెట్టింది. మతం మారితే పెళ్లి చేస్తానని షరతు విధించింది. అందుకు ప్రసాద్ ఒప్పుకోలేదు. రిహానా ఎన్నిసార్లు అడిగినా రెడ్డి ప్రసాద్ మతం మారేది లేదని తెగేసి చెప్పాడు. దీంతో కోపాద్రిక్తురాలైన ప్రేయసి తల్లి.. ప్రసాద్‌పై కత్తితో దాడికి పాల్పడింది. రిహానా దాడి నుంచి తప్పించుకున్న రెడ్డి ప్రసాద్ కుటుంబ సభ్యుల వద్దకు చేరాడు. దీంతో అతడిని ఆస్పత్రికి తరలించారు. రెడ్డి ప్రసాద్ కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు.
ఇవి కూడా చదవండి : Visakha: 280 మంది రౌడీ షీటర్లకు సీపీ స్ట్రాంగ్ వార్నింగ్