Kadapa: సారూ.. ఇవీ పరిష్కరించరూ..!

by srinivas |   ( Updated:2023-06-25 14:15:38.0  )
Kadapa: సారూ.. ఇవీ పరిష్కరించరూ..!
X

దిశ, కడప: ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించిన రాష్ట్ర ప్రభుత్వానికి ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు ధన్యవాదాలు తెలిపారు. కడపలో ఆయన విలేకర్లతో మాట్లాడుతూ సీఎం వైఎస్ జగన్ మాట ఇచ్చిన ప్రకారం కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ, సీపీఎస్ రద్దు చేయడం శుభపరిణామన్నారు. ఉద్యోగుల సమస్యలను ఎప్పటికప్పుడు సీఎం దృష్టికి తీసుకుని వెళ్లామని, ఆయన సానుకూలంగా స్పందించి పరిష్కరించారని తెలిపారు. సీఎంతో పాటు సీఎస్‌కు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు. 200 శాఖలను మూడు విభాగాలుగా విడదీసి అందరితో చర్చలు చేయడం హర్షణీయన్నారు. ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగానే కాంట్రాక్టు ఉద్యోగులు పని చేస్తున్నారని బొప్పరాజు వెంకటేశ్వర్లు పేర్కొన్నారు.

అటు ఔట్ సోర్సింగ్ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను కూడా పరిష్కారం చేయాలని కోరుతున్నామన్నారు. తక్కువ జీతం వచ్చే వారికి రేషన్ కార్డు, ప్రభుత్వ పథకాలను యథావిధిగా కొనసాగించాలని విజ్ఞప్తి చేశారు. సీఎఫ్ఎంఎస్‌లో పేరు ఉన్న కారణంగా ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు రేషన్ కార్డులు, ఇతర పథకాలు ఆగిపోయాయని, వారికి నష్టం జరగకుండా చూడాలని బొప్పరాజు వెంకటేశ్వర్లు కోరారు.

Advertisement

Next Story

Most Viewed