- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Home > ఆంధ్రప్రదేశ్ > వైయస్ఆర్ -కడప జిల్లా > Kadapa: దారుణం.. దంపతులపై కారం చల్లి కత్తితో దాడి.. భర్త మృతి
Kadapa: దారుణం.. దంపతులపై కారం చల్లి కత్తితో దాడి.. భర్త మృతి
by srinivas |
X
దిశ, కడప: అన్నమయ్య జిల్లా సుండుపల్లి మండలం కొండలతూర్పు గ్రామ పొలాల్లో దారుణం జరిగింది. పొలం వద్ద నిద్రిస్తున్న రామాంజనేయులరెడ్డి (50), ఆయన భార్య మనోహరిపై తోటి గ్రామస్తుడు పవన్ కుమార్ కత్తితో దాడి చేశారు. కంట్లో కారం కొట్టి దారుణంగా నరికి చంపారు. మెడలోని బంగారు గొలుసు కోసం పెనుగులాటలో మనోహరి గాయపడ్డారు. కేకలు విన్న గ్రామస్తులు రావడంతో పవన్ పరార్ అయ్యారు. రామాంజనేయరెడ్డి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రాయచోటి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సుండుపల్లి పోలీసులు కేసు నమోదు చేసి పవన్ కుమార్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. హత్యకు గల కారణాలు ఏమిటనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు సుండుపల్లి ఎస్సై రామకృష్ణారెడ్డి తెలిపారు.
Advertisement
Next Story