Bribe: ఏసీబీకి చిక్కిన రెవెన్యూ అధికారులు

by srinivas |
Bribe: ఏసీబీకి చిక్కిన రెవెన్యూ అధికారులు
X

దిశ, కడప: రైతు నుంచి లంచం తీసుకుంటుండగా రెవెన్యూ అధికారులను ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. వీరపనాయునిపల్లి మండలం వెల్దుర్తికి చెందిన రైతు శేఖర్ తన ఆరు ఎకరాల పొలం చుక్కల భూమిని ఆన్‌లైన్‌లో ఎక్కించుకోవడానికి 2012 నుంచి ఎమ్మార్వో కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారు. అయితే డిప్యూటీ తహశీల్దార్ శ్రీకాంత్ రెడ్డి, వీఆర్వో మునికృష్ణ రూ.50 వేలు ఇవ్వాలని లంచం డిమాండ్ చేశారు. దీంతో రైతు శేఖర్ ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. ఈ మేరకు వీరపునాయునిపల్లె రెవెన్యూ కార్యాలయంపై దాడి చేశారు. రూ. 30 వేలు లంచం తీసుకుంటూ వీఆర్వో మునికృష్ణ, డిప్యూటీ తహసిల్దార్ శ్రీకాంత్ రెడ్డి రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఎవరైనా అధికారులు లంచం అడిగితే ఏసీబీని సంప్రదించాలని ఏసీబీ అడిషనల్ ఎస్పీ దేవి ప్రసాద్ తెలిపారు. 14400 నెంబర‌కు ఫిర్యాదు చేయాలని కోరారు.

Advertisement

Next Story

Most Viewed