- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Kadapa: ఆర్టీసీ బస్సు డ్రైవర్‌ను చితకబాదిన ఉపాధ్యాయుడు.. కేసు నమోదు
దిశ, కడప: బస్సు నిలపలేదని ఆర్టీసీ అద్దె బస్సు డ్రైవర్‌పై ఓ ఉపాధ్యాయుడు దాడి చేశారు. ఈ ఘటన చక్రాయపేట మండలం నాగులగుట్టపల్లెలో జరిగింది. కాగా రాయచోటి - వేంపల్లె ప్రధాన రహదారిపై నాగులగుట్టపల్లె జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉంది. ఈ పాఠశాల నుంచి పలువురు ఉపాధ్యాయులు విధులు నిర్వహణ అనంతరం వారి స్వగ్రామాలకు వెళుతుంటారు. విధులు ముగియడంతో నాగులగుట్టపల్లె వద్ద రాయచోటి నుంచి వేంపల్లెకు వెళుతున్న ఆర్టీసీ బస్సును నిలపాలని తెలుగు ఉపాధ్యాయుడు రామ్మోహన్ కోరారు. డ్రైవర్ బస్సును ఆపినట్లే ఆపి వెళ్లి పోయారు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన ఉపాధ్యాయుడు మోటారు సైకిల్‌పై వెంబడించి బస్సు ఎందుకు ఆపలేదని కండక్టర్‌తో వాగ్వాదానికి దిగారు. డ్రైవర్ నరసింహులు జోక్యం చేసుకుని బస్సులో సీటింగ్ కెపాసిటీ 60 మంది అని, 50 పాసులు ఉన్నందున ఆపలేదని చెప్పారు. దీంతో ఇరువురు వాగ్వివాదానికి దిగారు. తీవ్ర ఆగ్రహంతో డ్రైవర్‌ను ఉపాధ్యాయుడు కింద పడేసి దాడి చేశారు. పలువురు అడ్డుకుంటున్నా వినకుండా విచక్షణా రహితంగా కొట్టారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ఉపాధ్యాయుడును అదుపులో తీసుకున్నారు. ఉపాధ్యాయుడు, ఆర్టీసీ డ్రైవర్‌ను విచారించారు. ఘటన పై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్.ఐ వినోద్ కుమార్ తెలిపారు.