- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Kadapa: కృష్ణా జలాల వివాదం.. సీఎంకు సరికొత్త డిమాండ్
దిశ, కడప ప్రతినిధి: కృష్ణా జలాల వినియోగంపై పున:సమీక్షకు సిద్ధమైన బ్రిజేశ్ కుమార్ ట్రైబ్యునల్ ముందు రాష్ట్రం తరపున సమర్థవంతమైన వాదనలు వినిపించేలా జగన్ తక్షణమే చర్యలు తీసుకోవాలని టిడిపి శాసన మండలి సభ్యులు భూమిరెడ్డి రామ్ గోపాల్ రెడ్డి డిమాండ్ చేశారు. ప్రతిపక్షనేతను వేధించడంపై పెడుతున్న శ్రద్ధలో సగమైనా ముఖ్యమంత్రి సొంత ప్రాంత సాగునీటి ప్రయోజనాలపై పెట్టాలని సూచించారు. రాష్ట్రానికి ఇదివరకు దక్కిన కృష్ణా నీటిలో ఒక్క టీఎంసీ పక్కకు పోకుండా చూడాల్సిన భాద్యత ముఖ్యమంత్రిదేనన్నారు. మంగళగిరి టీడీపీ జాతీయ కార్యాలయంలో భూమిరెడ్డి రామ్ గోపాల్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. తనకు, తన తండ్రికి రాజకీయ జన్మనిచ్చిన రాయలసీమకు అన్యాయం జరక్కుండా జగన్మోహన్ రెడ్డి కేంద్రంతో న్యాయస్థానాల్లో పోరాడాలని, తక్షణమే అపెక్స్ కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేయించి ట్రైబ్యునల్ ఎదుట ఏపీ ప్రభుత్వ వాదనలు వినిపించేలా ముఖ్యమంత్రి చర్యలు తీసుకోవాలని కోరారు.
రాష్ట్ర రైతాంగం కోసం జగన్ ఒకడుగు ముందుకు వేస్తే, టీడీపీ రెండడుగులు వేస్తుందని అన్నారు. సాగునీటి రంగంలో జగన్ రెడ్డి అనురిస్తున్న అస్తవ్యస్థ విధానాలు, అనాలోచిత నిర్ణయాలతో రాయలసీమ ప్రాంతం శాశ్వత ఎడారిగా మారబోతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత కృష్ణానదీ జలాలను ఏపీకి 512 టీఎంసీలు, తెలంగాణకు 299 టీఎంసీల చొప్పున కేటాయించారని, దాని ప్రకారమే ఇన్నాళ్లుగా ఉభయ తెలుగురాష్ట్రాలు నీటిని వినియోగించుకు న్నాయని, కానీ తాజాగా తెలంగాణ ప్రభుత్వం నీటికేటాయింపులపై కొత్త వాదన చేయడంతో కేంద్ర ప్రభుత్వం దిగొచ్చి కృష్ణాజలాల కేటాయింపుల్ని పున: పరిశీలన చేయాల్సిందిగా బ్రిజేశ్ కుమార్ ట్రైబ్యునల్‌ను ఆదేశించిందని భూమిరెడ్డి రామ్ గోపాల్ రెడ్డి తెలిపారు.
నిమ్మకు నీరెత్తిన జగన్ ప్రభుత్వం
తెలంగాణ వాదనపై కేంద్రం స్పందించి, కృష్ణా జలాల వినియోగంపై పున:సమీక్ష చేయాలని బ్రిజేశ్ కుమార్ ట్రైబ్యునల్‌ను ఆదేశించినా, జగన్ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తి నట్టు వ్యవహరించడం దేనికి సంకేతమని ప్రశ్నించారు. కృష్ణాజలాలనే నమ్ముకున్న రాయలసీమ ప్రాంతానికి కేంద్ర నిర్ణయంతో అన్యాయం జరుగుతున్నా, తనకు రాజకీయ జన్మనిచ్చిన ప్రాంతం మొత్తం ఎడారిగా మారే పరిస్థితులున్నా ముఖ్యమంత్రి మౌనంగా ఉండటాన్ని ఏమనాలని భూమిరెడ్డి రామ్ గోపాల్ రెడ్డి ప్రశ్నించారు.
తెలంగాణ రాష్ట్రం అనుమతులు లేకుండా కృష్ణానదిపై నిర్మించిన ప్రాజెక్టులపై ఏనాడు జగన్ రెడ్డి ఎందుకు ప్రశ్నించలేదని పేర్కొన్నారు .పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం నిర్మాణా న్ని తెలంగాణ ప్రభుత్వం శరవేగంగా కొనసాగిస్తోందని, ఆ పథకంపై నేషనల్ గ్రీన్ ట్రిబ్యున ల్ అభ్యంతరాలు లేవనెత్తినా తెలంగాణ సర్కార్ నిర్మాణ పనులు ఆపలేదని, నేషనల్ గ్రీన్ ట్రిబ్యు నల్‌లో స్టే ఉన్నాకూడా కేవలం కేంద్రప్రభుత్వ మద్దతుతోనే తెలంగాణ సర్కార్ ఆ పథకానికి సంబంధించి 6 రకాల అనుమతులు సాధించిందని భూమిరెడ్డి రామ్ గోపాల్ రెడ్డి తెలిపారు.
పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతల పూర్తయితే, కృష్ణాజలాల్లో రాయలసీమకు తీవ్ర నష్టం జరుగుతుందని, ఇదంతా తెలిసి కూడా జగన్మోహన్ రెడ్డి నిద్రపోయారని, ఏనాడూ కేంద్రప్రభుత్వం వద్ద తన వాదన చెప్పే ప్రయత్నం చేయలేదని ఆరోపించారు. కనీసం తెలంగాణ ప్రభుత్వంపై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్‌కు ఫిర్యాదు కూడా చేయలేదని, ఇదంతా గమనిస్తే పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం నిర్మాణాన్ని జగన్మోహన్ రెడ్డి స్వాగతిస్తున్నట్టే కనిపిస్తోందని భూమిరెడ్డి రామ్ గోపాల్ రెడ్డి ఆరోపించారు.