Kadapa: భార్య కాపురానికి రాలేదని టవర్ ఎక్కిన భర్త

by srinivas |
Kadapa: భార్య కాపురానికి రాలేదని టవర్ ఎక్కిన భర్త
X

దిశ, కడప: వైయస్సార్ జిల్లా పులివెందుల పట్టణంలోని నగిరిగుట్టకు చెందిన సంతోష్ అనే వ్యక్తి తన భార్య కాపురానికి రాలేదని సెల్ టవర్ ఎక్కి ఆత్మహత్య చేసుకుంటా అని బెదిరించారు. పులివెందుల పట్టణానికి చెందిన మేరీ అనే మహిళను జమ్మలమడుగుకు చెందిన సంతోష్ అనే వ్యక్తికి ఇచ్చి చాలా వివాహం చేశారు. అయితే సంతోష్ తన భార్య మేరీతో తరచూ గొడవ పడుతూ ఉండడంతో మేరీ పులివెందులలో ఉన్న తల్లిదండ్రుల వద్దకు చేరుకుంది. దీంతో పెద్ద మనుషుల పంచాయితీతో సంతోష్, మేరీలు పులివెందులలో సంసారాన్ని పెట్టారు.


అయితే సంతోష్ వ్యవహారం మారకపోవడంతో పాటు రోజు వచ్చి ఘర్షణ పడుతూ ఉండడంతో సంతోష్‌ను మేరీ, మేరీ అమ్మ ఇంట్లోకి రానివ్వడం లేదు. దీంతో ఆత్మహత్య చేసుకుంటానని సంతోష్ సెల్ టవర్ ఎక్కి బెదిరించారు. ఈ విషయం తెలుసుకున్న ఎస్సై హుస్సేన్ సెల్ టవర్ ఎక్కిన సంతోష్‌కు నచ్చచెప్పి చాకచక్యంగా వ్యవహరించి కిందికి దింపి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అనంతరం పోలీస్ స్టేషన్లో సంతోష్, మేరీ, మేరీ అమ్మ లకు కౌన్సిలింగ్ ఇచ్చారు. దీంతో ఎస్సై హుస్సేన్‌ను స్థానికులు అభినందించారు.

Advertisement

Next Story